Begin typing your search above and press return to search.
విలన్ రోల్ కోసం జాతీయ ఉత్తమ నటుడికి ఎంత ఇస్తున్నారు..?
By: Tupaki Desk | 22 March 2021 7:07 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు. పాన్ ఇండియా అప్పీల్ కోసం ఇతర ఇండస్ట్రీల స్టార్ యాక్టర్స్ ని తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. దీని వల్ల ఎలాగూ డిజిటల్ - శాటిలైట్ రైట్స్ ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ''పుష్ప'' సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ఫహాద్ ఫాజిల్ ను తీసుకున్నారు.
మాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్.. లెజెండరీ మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడు. 'రాజా రాణి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ నజ్రియా భర్త. ఈ మధ్య 'ట్రాన్స్' సినిమాతో తెలుగు ఓటీటీ ఆడియన్స్ మెప్పుపొందాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'పుష్ప' సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అయితే నెగిటివ్ రోల్ చేయడానికి ఫహాద్ ఎంత తీసుకొని ఉంటాడనేది చర్చనీయాంశంగా మారింది.
'పుష్ప' సినిమాని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా వారు విలన్ పాత్ర కోసం ఫహాద్ కు దాదాపు 5 నుంచి 5.5 కోట్లు వరకు ముట్టజెప్తున్నారట. మలయాళ మార్కెట్ తో పోల్చుకుంటే ఇది పెద్ద అమౌంట్ అనే చెప్పవచ్చు. కానీ ఫహాద్ లాంటి నేచురల్ యాక్టింగ్ ని బట్టి చూస్తే ఈ రెమ్యూనరేషన్ తక్కువే అని సినీ అభిమానులు అంటున్నారు. ఇక ఫహాద్ రాక మలయాళ - తమిళ మార్కెట్ కి బాగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో మల్లూ అర్జున్ గా పిలవబడే బన్నీ 'పుష్ప' తో అక్కడ రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.