Begin typing your search above and press return to search.

అబ్దుల్ కలామ్ పాత్రలో ఆ నటుడు?

By:  Tupaki Desk   |   15 May 2019 2:30 AM GMT
అబ్దుల్ కలామ్ పాత్రలో ఆ నటుడు?
X
ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకూ బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ట్రెండ్ లో భాగంగా ఫిలిం మేకర్స్ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన లెజెండ్స్ ను అస్సలు వదిలిపెట్టడం లేదు. వారి జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భారత రత్న మాజీ రాష్ట్రపతి 'భారత రత్న' ఎపీజే అబ్దుల్ కలామ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

టాలీవుడ్ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్.. అనిల్ సుంకర ఈ బయోపిక్ ను సంయక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో కలామ్ పాత్రకు సీనియర్ బాలీవుడ్ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ పరేష్ రావల్ ను ఎంచుకున్నారట. ప్రస్తుతం ఆయనతో చర్చలు సాగుతున్నాయట. ఇక ఈ ప్రాజెక్టులో అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. నిర్మాత అనిల్ సుంకర తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టి దర్శకుడిగా మారుతున్నారట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందని.. రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభిస్తారని సమాచారం. రాజ్ చెంగప్ప రచించిన కలామ్ బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తారట. భారత దేశంలో కులమతాలకు.. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే వ్యక్తి అబ్దుల్ కలామ్. ఆయన జీవితం ఎంతోమందికి ప్రేరణ. అలాంటి కలామ్ గారి బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నారంటే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.