Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU లీక్‌ : నటరాజ్ కు బై బై చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 Oct 2021 4:01 AM GMT
#BIGGBOSS5TELUGU లీక్‌ :  నటరాజ్ కు బై బై చెప్పేశారు
X
తెలుగు బిగ్‌ బాస్ నాల్గవ వారం కూడా ముగిసింది. మొదటి మూడు వారాల్లో సరయు.. ఉమాదేవి మరియు లహరిలు ఎలిమినేట్ అయ్యారు. నాల్గవ వారంలో ఎనిమిది మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఎనిమిది మందిలో నటరాజ్ మరియు లోబోలు వీక్ అంటూ ప్రచారం జరిగింది. అయితే లోబో ఎంటర్ టైనర్‌.. ఖచ్చితంగా అతడు ఇంట్లో ఉంటే బాగుంటుంది అని కొద్ది మంది అయినా భావించి ఉంటారు. కాని నటరాజ్ మాస్టర్‌ అతిని చూసి చూసి విసిగి పోయారు. ఆయన వెకిలి నవ్వు మరియు ప్రతి ఒక్కరికి కూడా జంతువులతో పోల్చుతూ పేర్లు పెట్టడం చేస్తూ విమర్శలు మూట కట్టుకున్నాడు. నటరాజ్ మాస్టర్ మరీ చిల్లరగా వ్యవహరించాడు అంటూ విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

నటరాజ్ మాస్టర్ పదే పదే రవిని గుంట నక్క అనడం.. విశ్వను ఊరసవెళ్లి అనడం వంటివి ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పించాయి. ఆయన ఎవరిని పడితే వారిని జంతువులతో పోల్చడంతో పాటు ఒకరి ముందు ఇంకొకరితో బ్యాడ్‌ గా మాట్లాడటం కూడా ఆయన క్యారెక్టర్ ను దెబ్బ తీశాయి. ఒక జోకర్ తరహాలో అతడు మారిపోయాడు. నాగార్జున కూడా అతడి తీరు పట్ల రెండవ వారం నుండే అసంతృప్తిగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఇంట్లో పెద్ద వాడిగా ఎంతో హుందాగా నడుచుకోవాలి.. ప్రతి ఒక్కరిని కూడా ఒక ట్రాక్ లో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాని నామినేషన్స్ అనగానే ఆయన పిచ్చి ప్రేలాపనలు చేయడం జరుగుతుంది.. ఆయన తనను ఎవరు నామినేట్‌ చేసినా కూడా అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా మండి పోతూనే ఉన్నాడు.

ఈయన హౌస్‌ లోకి వెళ్లిన సమయంలో సగం సీజన్ అయినా ఉంటాడని అంతా ఆశించారు. కాని అతడి ప్రవర్తనతో అతడి అవసరం ఇక్కడ లేదు అంటూ ప్రేక్షకులు తేల్చి పారేశారు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా బిగ్ బాస్ లీక్ వచ్చింది. అందులో నటరాజ్ వెళ్తాడని చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన లీక్ లు అన్ని కూడా నిజమే అయ్యాయి కనుక ఈసారి కూడా ఖచ్చితంగా నటరాజ్ బయటకు వెళ్లి పోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది. ఆదివారం ఎపిసోడ్‌ లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించి నాగార్జున ఆయనతో మాట్లాడించి బయటకు పంపిస్తాడు. నాగ్ సర్ తో స్టేజ్ పై ఉన్న సమయంలో అయినా గుంట నక్క.. ఊసరవెల్లి ఎవరు అనే విషయాన్ని చెప్తాడా అనేది చూడాలి.