Begin typing your search above and press return to search.

సైరాలో బిజ్జాలదేవుడి పాత్ర ఇదే

By:  Tupaki Desk   |   15 March 2018 11:02 AM GMT
సైరాలో బిజ్జాలదేవుడి పాత్ర ఇదే
X
బాహుబ‌లి సినిమాలో బిజ్జాలదేవ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు నాజ‌ర్‌. ఆ పాత్ర అత‌నికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాక‌పోతే వ‌య‌సు మీద ప‌డడం వ‌ల్ల‌నేమో... బాహుబ‌లి త‌రువాత అత‌నికి మంచి రోల్స్ రాలేదు. ఇప్పుడు సైరాలో ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నాడు. అత‌ని పాత్ర గురించి ఫిల్మ్ న‌గ‌ర్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

భార‌త స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్‌ను సైరా న‌ర‌సింహారెడ్డి పేరుతో సినిమా తీస్తున్నారు. ఇందులో చిరు ఉయ్యాల‌వాడ‌గా న‌టిస్తున్నారు. ఇది అత‌ని 151వ చిత్రం. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సినిమా. ఇందులో నాజ‌ర్ చిరు గాడ్ ఫాద‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. న‌ర‌సింహారెడ్డి పెళ్లి విష‌యంలో కూడా అత‌నే నిర్ణయం తీసుకుంటాడ‌ని... పెళ్లి జ‌రిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ సినిమా చిరు ప‌క్క‌న న‌య‌న‌తార న‌టించ‌నుంది. అలాగే అమితాబ్ బ‌చ్చ‌న్ విజ‌య్ సేతుప‌తి జ‌గ‌ప‌తి బాబు సుదీప్ వంటి భారీ తారాగ‌ణం సైరాలో న‌టించ‌నుంది. అతి త్వ‌ర‌లో అమితాబ్ షూటింగ్‌లో పాల్గొంటార‌ని స‌మాచారం.

ఈ సినిమా కోసం ఒక‌రితో ఇద్ద‌రితో కాద పెద్ద టీమ్ రైట‌ర్స్‌తోనే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ప‌నిచేస్తున్నాడ‌ట‌. చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు చిత్ర‌యూనిట్‌. ఈ సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకోవాల‌న్న‌ది సురేంద‌ర్ రెడ్డి ల‌క్ష్యం. ఇప్ప‌టికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌యింది. రెండో షెడ్యూల్ షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రానికి మాటలు అందిస్తున్న సాయిమాధవ్ బుర్రా.. అద్భుత‌మైన డైలాగులు రాసి చిరు రాంచ‌ర‌ణ్ సురేంద‌ర్ రెడ్డిల‌తో శభాష్ అనిపించుకున్నాడ‌ని స‌మాచారం.