Begin typing your search above and press return to search.

అనుష్కను నాజర్ దత్తత తీసుకున్నాడా?

By:  Tupaki Desk   |   30 Oct 2015 6:38 AM GMT
అనుష్కను నాజర్ దత్తత తీసుకున్నాడా?
X
అవును.. అనుష్కను నాజర్ దత్తత తీసుకున్నాడట. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా చాలా సీరియస్ గా అన్నారు నాజర్. అనుష్క నా కూతురు అంటూ సైజ్ జీరో తమిళ వెర్షన్ ‘ఇంజి ఇడుపళగి’ ఆడియో ఫంక్షన్లో సభాముఖంగా ప్రకటించారు నాజర్. సైజ్ జీరో సినిమా విషయంలో అనుష్క పడ్డ కష్టం గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు నాజర్ సార్. ఇటీవలే తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నాజర్.. ఇంజి ఇడుపళగి’ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..

‘‘నిజానికి ఈ ఆడియో వేడుకతో నాకేమీ సంబంధం లేదు. నేను ఈ కార్యక్రమానికి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా రాలేదు. అనుష్కకు తండ్రిగా వచ్చాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. అనుష్కను నేను దత్తత తీసుకున్నా. అనుష్క నా కూతురు. ఆమె ఈ సినిమా చేస్తోందని తెలియగానే నా వంతుగా ఏ సాయమైనా చేస్తానని చెప్పా. ఓ క్యారెక్టర్ కోసం చాలా లావుగా కనిపించాల్సి ఉంటుందంటే.. నాకు తెలిసిన ప్రోస్థెటిక్ మేకప్ వేసే ఆర్టిస్టులకు చెబుతానని.. వాళ్లే అంతా చూసుకుంటారని చెప్పాను. కానీ ఆమె మాత్రం మేకప్ వద్దని, నిజంగానే బరువు పెరుగుతానని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ కాలంలో అనుష్కకు ఉన్న డెడికేషన్ మరెవరికీ ఉండదు. తన కోసం ఈ సినిమా బాగా ఆడాలి’’ అన్నాడు నాజర్.