Begin typing your search above and press return to search.

15ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ మళ్లీ

By:  Tupaki Desk   |   24 Jun 2015 5:41 AM GMT
15ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ మళ్లీ
X
సరిగ్గా 15ఏళ్ల క్రితం 'నరసింహా' సినిమాలో రమ్యకృష్ణ నటన టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. నీలాంబరిగా పగ ప్రతీకారాన్ని హావభాబాల్లో చూపించిన తీరును ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అప్పట్లో నీలాంబరి.. మళ్లీ ఇన్నాళ్టికి శివగామి.. ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకుంటోంది. రాజమాత శివగామి ప్రస్తుతం ఇంటా బైటా హాట్‌ టాపిక్‌. టాలీవుడ్‌ చరిత్రలోనే ఇప్పటివరకూ ఇలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ లేనేలేదన్న టాక్‌ నడుస్తోంది. బాహుబలి కథను నడిపించే అత్యంత కీలకమైన పాత్ర శివగామి. ఈ క్యారెక్టర్‌లో అసమాన నటనను, ఆహార్యాన్ని ప్రదర్శించే స్కోప్‌ ఉందని చెప్పుకుంటున్నారు. రమ్యకృష్ణ ఈ పాత్రలో అద్భుతమైన అభినయం ప్రదర్శించారని రాజమౌళి స్వయంగా చెప్పారు. అంతేకాదు రమ్యకృష్ణ - నాజర్‌ కాంబినేషన్‌లో హైలైట్‌ సీన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ కాంబినేషన్‌ అనగానే నరసింహా మరోసారి గుర్తొస్తుంది. నీలాంబరికి అన్నగా నాజర్‌ అభినయించిన తీరును తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ ఇద్దరూ కలిసి నటించింది ఆ సినిమాలోనే. తర్వాత మళ్లీ ఇంతకాలానికి కలిసి బాహుబలి చిత్రంలో నటించారు.

అక్కడ నీలాంబరి క్యారెక్టర్‌తో నాజర్‌ కెమిస్ట్రీని దృష్టిలో పెట్టుకునే విజయేంద్ర ప్రసాద్‌ తాజా క్యారెక్టర్లను క్రియేట్‌ చేసి ఉంటారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఏదేమైనా 15ఏళ్ల తర్వాత మ్యాజికల్‌ కాంబినేషన్‌ రిపీటవ్వడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌.