Begin typing your search above and press return to search.

బాహుబలికి విలన్ దొరికేశాడు

By:  Tupaki Desk   |   2 Oct 2017 9:15 AM GMT
బాహుబలికి విలన్ దొరికేశాడు
X
బాహుబలి లో విలన్ గా నటించిన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు రానా. హీరోగానే నటిస్తూ కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్ని ట్రై చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నాడు. మరోవైపున బాహుబలి ప్రభాస్ కూడా తన నెక్ట్స్ మూవీ సాహో పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతవరుకు బాగానే ఉంది కానీ బాహుబలిలో వీరిద్దరి పాత్రలు నువ్వా నేనా అనే రీతిన ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ కి వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ కటౌట్ కి సరిపడే విలన్ దొరకడం లేదట. పోనీ రానానే మళ్లీ విలన్ గా నటించమని అడుగుదామంటే ప్రస్తుతం ఈ టాలీవుడ్ హంక్ బిజీబిజీగా ఉన్నాడు.

అయితే ఈ సమస్యకి సాహో డైరెక్టర్ సుజిత్ కి సింపుల్ గా సొల్యూషన్ దొరికిందట. ఈ సినిమాతో బాలీవుడ్ లో ప్రభాస్ మార్కెట్ ను ఇంకా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. దాంతో పాటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నసీరుధ్ధీన్ షాను తీసుకోవాలనే ఆలోచనలో సుజిత్ అండ్ టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ కటౌట్ కి నసీరుద్దీన్ సరిపోతాడా అనే డౌట్ ఫ్యాన్స్ కి వచ్చే అవకాశమే లేనంత రీతిన నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ సినిమా మొత్తం నార్త్ ఫ్లేవర్ తో నింపేస్తున్న సాహో బృందం తెలుగు ప్రేక్షకుల్ని ఏ రీతిన ఆకట్టుకుంటారో చూడాలి.