Begin typing your search above and press return to search.

నర్తనశాల మళ్లీ మొదలైంది!

By:  Tupaki Desk   |   6 Oct 2017 1:23 PM IST
నర్తనశాల మళ్లీ మొదలైంది!
X
అలనాటి చిత్రాల్లో మేటి చిత్రం నర్తనశాల. యన్టీఆర్ - ఎస్వీఆర్ - సావిత్రి - శోభన్ బాబు - ముక్కామల - రేలంగి వంటి అగ్ర తారలతో కమలాకర్ కామేశ్వరరావు తెరకెక్కించిన ఈ మహాభారత ఘట్టాన్ని తెలుగు సినీ అభిమానులు ఎప్పటికి మరువరనడంలో అతిశయోక్తి లేదు. అటు అర్జునుడు ఇటు బృహనలగా యన్టీఆర్ నటించిన తీరుకి అఖిలాంద్ర ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. కీచకుని ఎస్వీఆర్ అభినయానికి ఇంకెవ్వరూ సాటి రారని విమర్శకులు చెబుతుంటారు. అయితే ఇన్ని విశేషాలు ఉన్న చిత్రం మళ్లీ రూపొందబోతుందని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైంది.

అయితే పేరు పాతదే అయినా మహాభారత ఘట్టం - అర్జునుడు - రథాలు - కోటలు - గుర్రాలు వంటి అంశాలు త్వరలో తెరకెక్కబోతున్న కొత్త నర్తనశాలలో ఉండవట. నర్తనశాల థీమ్ ని తీసుకొని ఆ పాయింట్ ని సోషలైజ్ చేసి ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమా తీస్తున్నారని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ నడుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరో - హీరోయిన్ ఎవరు అనే వివరాలు పై ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు. ఫిల్మ్ ఛాంబర్ లో మాత్రం ఓ కొత్త నిర్మాణ సంస్థ పేరు మీద ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. మరి అలనాటి నర్తనశాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తుందో చూద్దాం.