Begin typing your search above and press return to search.

అమావాస్యలో రాక్ స్టార్ బ్యూటి

By:  Tupaki Desk   |   24 Feb 2018 8:00 AM IST
అమావాస్యలో రాక్ స్టార్ బ్యూటి
X
రన్ బీర్ కపూర్ రాక్ స్టార్ మూవీ తో అరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రి కి బాలీవుడ్ లో బాగానే క్రేజ్ ఉంది. హౌస్ ఫుల్ 3 - బాంజో లాంటి సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించిన ఈమె సల్మాన్ ఖాన్ కిక్ సినిమాలో ఒక పాట లో కూడా దర్శనమిచ్చింది. తన అందంతో అందరిని ముగ్దులు చేసిన నర్గీస్ ఇప్పుడు ఒక దెయ్యం సినిమాలో నటించబోతోంది.

ఎప్పుడో 2016 లో కనిపించింది స్క్రీన్ పైన. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత రాబోతోంది. 'అమావాస్' అనే టైటిల్ తో త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా ఎప్పుడు నర్గీస్ ఇలాంటి సినిమాలలో నటించలేదు. భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ దెయ్యం సినిమా లో సచిన్ జోషి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం 35 రోజులు సాగే షెడ్యూల్ కై లండన్ వెళ్లారని సమాచారం. ఇప్పటికే రాగిణి ఎం.ఎం.ఎస్ 2 - ఏలోన్ - 1920 ఈవిల్ రిటర్న్స్ లాంటి సినిమాలతో మనల్ని భయపెట్టిన భూషణ్ కుమార్ ఇప్పుడు మళ్లీ అందాల భామ నర్గీస్ తో బయపెట్టబోతున్నాడు.

కేవలం తన బికినీ లుక్కులతో.. క్లీవేజ్ లుక్కులతో కవ్వించే నర్గీస్ ఫక్రీ.. అసలు యాక్టింగ్ పరంగా ఎప్పుడూ మనల్ని ఇంప్రెస్ చేసిందే లేదు. మరి అమావాస్యలో నర్గీస్ దెయ్యంగా కనిపిస్తుందా లేదంటే దెయ్యంచే పీడించబడే అమ్మాయిగా కనిపిస్తుందో తెలియదు కాని.. ఈమెకు భారీ బ్రేక్ రావడానికి ఇదొక్కటే చివరి అవకాశం. చూద్దం ఏమవుతుందో.