Begin typing your search above and press return to search.

నర్గీస్ ఫక్రీకి అలాంటి జబ్బు ఉందా?

By:  Tupaki Desk   |   25 Aug 2016 11:49 AM IST
నర్గీస్ ఫక్రీకి అలాంటి జబ్బు ఉందా?
X
అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రీ.. బాలీవుడ్ లో బాగానే సెటిల్ అయిపోయింది. త్వరలో ఈ భామ బాంజో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మధ్య ఈమెపై బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. తాజాగా డిషూం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనక పోవడం.. ఆ సమయంలో అమెరికాకి వెళ్లిపోవడానికి.. ఉదయ్ చోప్రాతో బ్రేకప్ కారణమంటూ పుకార్లు పుట్టేశాయి. కానీ ఇందుకు అసలు కారణం ఏంటో ఇప్పుడు చెప్పేసింది నర్గీస్.

'నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఆర్సెనిక్(శరీరంలో రాళ్లు పేరుకోవడం)తో బాధపడుతున్నాయి. ఎవరికీ నా సమస్య ఏంటో తెలీదు. డాక్టర్లు కూడా నన్ను పరీక్షించి.. చాలా భయపడ్డారు. అంత హై లెవెల్ కి నా సమస్య చేరుకుంది. ఏం చేయాలనే ఆలోచన చేసి.. ఆయుర్వేదంలో ప్రయోగాలు చేశాను. బోలెడంత రీసెర్చ్ చేసి.. చివరకు నా జబ్బు నయం చేసుకున్నాను. రీసెంట్ గా అమెరికా వెళ్లి పరీక్షలు చేయించుకుంటే పూర్తిగా తగ్గిపోవడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు' అని చెప్పింది నర్గీస్ ఫక్రీ.

ఇత తనకు పెళ్లి ఆలోచనలు లేవని.. అవతలి వాళ్ల ఆస్తిలో సగం వాటా కోసం పెళ్లి చేసుకుంటారని.. తనకు ఆ అవసరం లేదంటూ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించిన నర్గీస్ ఫక్రీ.. పెళ్లి అంటే ఓ లేబుల్ మాత్రమే అనేసింది.