Begin typing your search above and press return to search.

మతులు పోగొట్టే అందం

By:  Tupaki Desk   |   10 Jun 2017 3:45 PM IST
మతులు పోగొట్టే అందం
X
రణ్ బీర్ కపూర్ సినిమా రాక్ స్టార్ తో ఇండియాకు దిగుమతి అయిన అమెరికా అందం నర్గీస్ ఫక్రి. ఆమె అందచందాలకు ఆ సినిమాలో హీరోయే కాదు.. ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. మత్తెక్కించే చూపులు.. కవ్వించే కళ్లు... కుర్రాళ్ల మతులు పోగొట్టే అందం ఆమె సొంతం కావడంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలుగా బాగానే వచ్చాయి. అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం మొహమాట పడకపోవడంతో ఏడాదికి రెండు సినిమాల్లో అభిమానులను అలరిస్తూనే ఉంది.

నర్గీస్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె ట్విట్టర్ పోస్టులు ఫాలో అయేవారికి కొంచెం వేదాంతం చెబుతూ ఉంటుంది. అదే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె అందచందాలు అన్నింటినీ ఆరబోస్తూ ఫోజులిస్తుంది. వాటిని చూసి తరించాలనుకునే వారు మాత్రం ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతుండాల్సిందే. తరచూ సోకులు, సొంపులు ప్రదర్శిస్తూ సెల్ఫీలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. లేకపోతే స్టన్నింగ్ ఫొటలతో గుండెలు కొల్లగొట్టేస్తుంటుంది. ఒక్కో ఫొటోలో ఒకో రకంగా అందాలతో కనువిందు చేస్తుంటే ిఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అయిపోయేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

నర్గీస్ ఫక్రి అందాలను చూసి తరించేందుకు ఇప్పటికే 4 మిలియన్ల కు పైగా ఫాలోయర్లు ఉన్నారు. కొత్తగా రోజూ వేలమంది ఫాలోయర్లు వచ్చి చేరుతున్నారంటే అమ్మడు ఎలాంటి సెక్సీ ఫోజులిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/