Begin typing your search above and press return to search.

కంచులాంటి టైటిల్ ఇచ్చింది న‌రేషేనా?

By:  Tupaki Desk   |   16 July 2015 2:58 PM GMT
కంచులాంటి టైటిల్ ఇచ్చింది న‌రేషేనా?
X
మోహ‌న్‌బాబు 23యేళ్ల త‌ర్వాత `అల్ల‌రి మొగుడు` కాంబినేష‌న్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసింది. ఈసారి మోహ‌న్‌బాబుతో పాటు అల్ల‌రి చేయ‌డానికి న‌రేష్ వ‌స్తున్నాడు. శ్రీనివాస‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాకి `మామ మంచు... అల్లుడు కంచు` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ విన్న‌ప్ప‌ట్నుంచి `అబ్బ‌... భ‌లే కుదిరిందే` అని మాట్లాడుకొంటున్నారు జ‌నాలు. అయితే ఈ టైటిల్ని సూచించింది అల్లరి న‌రేషే అట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా తెలిపాడు మంచు విష్ణు.

మంచు విష్ణు నిర్మాణంలోనే `మామ మంచు అల్లుడు కంచు` తెర‌కెక్క‌బోతోంది. మోహ‌న్‌బాబు, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ చాలా గ‌మ్మ‌త్త‌యిన‌ది అని చెప్పొచ్చు. ఈ కాంబినేష‌న్‌లో సినిమాని ఎవ్వ‌రూ ఊహించ‌రు. ఇక్క‌డే స‌గం ఆస‌క్తిని క్రియేట్ చేశారు. ఇక శ్రీనివాస‌రెడ్డికీ, అల్ల‌రి న‌రేష్‌కీ మంచి ర్యాపో ఉంది. ఇదివ‌ర‌కు వాళ్లిద్ద‌రూ క‌లిసి ప‌లు చిత్రాలు చేశారు. న‌రేష్ సినిమాలో ఎలాంటి వినోదం ఉంటే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుద్దో శ్రీనివాస‌రెడ్డికి బాగా తెలుసు. ఇక మోహ‌న్‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అటు అల్ల‌రి చేయ‌డానికైనా, ఇటు గంభీరంగా క‌నిపించ‌డానికైనా ఆయ‌న సిద్ధ‌మే. అందుకే.. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. టైటిల్ కూడా బాగా కుద‌ర‌డంతో నిర్మాత మంచు విష్ణు ఆనందంగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నారు. మంచి టైటిల్ ఇచ్చిన న‌రేష్‌కి విష్ణు ట్వి ట్ట‌ర్ ద్వారా కృత‌జ్జ‌తలు చెప్పాడు.