Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్

By:  Tupaki Desk   |   13 Oct 2021 8:16 AM GMT
ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్
X
మా ఎన్నికలు మొదలైనప్పటి నుంచి విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ఆగడం లేదు. ఈ మాటల యుద్ధం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అర్థం కావడం లేదు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు , మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విష్ణు బాధ్యతలు చేపట్టడంతో తనకు సంతోషంగా ఉందని నరేశ్ అన్నారు. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ‘మా’ ఒక సేవా సంస్థ అని పేర్కొన్నారు.

ఎన్నికలు అయిపోయాక ఇక ఆరోపణలు ఎందుకని నరేశ్ ప్రశ్నించారు. ‘ముండమోపిలా ఆ ఏడుపులెందుకు’ అంటూ నరేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతిగా ఏడ్చేవాళ్లను నమ్మోద్దని పేర్కొన్నారు.

‘మా’లో పెత్తందారి వ్యవస్థ పోవాలి.. అందరం కలిసి పనిచేయాలని సూచించారు. ప్రశ్నించేవారు ఏం ప్రశ్నిస్తారో చూస్తామని చెప్పారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాలు, విమర్శలు సాగుతున్న వేళ తాజాగా ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ‘పెన్షన్ల’ ఫైలుపై తొలి సంతకం చేయడం విశేషం. అనంతరం విష్ణుకు మద్దతుగా నరేశ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ వర్గం నుంచి వస్తున్న విమర్శలు, మూకుమ్మడి రాజీనామాలపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.