Begin typing your search above and press return to search.

స్టార్ తల్లీకొడుకుల సేంద్రియ వ్యవసాయం

By:  Tupaki Desk   |   18 Jan 2017 11:21 AM GMT
స్టార్ తల్లీకొడుకుల సేంద్రియ వ్యవసాయం
X
ఈమధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ క్షేత్రాల్లో కలిగే ఉత్సాహం, అనంతరం కలిగే తృప్తి అంతా ఇంతా కాదని చెబుతుంటారు కూడా. ఈ విషయంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పవన్ కళ్యాణ్ - ప్రకాష్ రాజ్ - సీనియర్ నరేష్ వంటి సెలబ్రిటీలు నడుం కట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒకడుగు ముందుకేసిన సీనియర్ నటుడు నరేష్... సేంద్రీయ వ్యవసాయం వంటి వాటి విషయంలో రైతుల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని అంటుండటం విశేషం.

గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ నటి విజయ నిర్మల - ఆమె కొడుకు నరేష్ ఉత్సాహంగా ఈ ఆర్గానిక్ ఫామింగ్ లో పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తమ హోదాకు తగినట్టుగా ఆదాయం లేకపోయినా.. బాధ లేదని, తీరిక సమయాల్లో దీన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నాడు నరేష్. వ్యవసాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని, తృప్తిని తన మాటలతో ఎంతో సంబరంగా చెబుతున్నాడు.

ఇంకా తమ వ్యవసాయ క్షేత్రాలపై స్పందించిన నరేష్... మణిమంగళం.గ్రామ శివార్లలోను - షాద్ నగర్ సమీపంలోను తమకు వ్యవసాయ క్షేత్రాలున్నాయని.. ఈ ఫాం హౌస్ లలో మామిడితో పాటు పలురకాల పండ్ల తోటలు ఉన్నాయని చెబుతున్నారు. వీటితోపాటు దాదాపు అన్ని రకాల కాయగూరలు కూడా పండిస్తున్నామని చెప్పాడు. ఈ సందర్భంలో అచ్చు రైతులమాదిరే విజయ నిర్మల - నరేష్ లిద్దరూ తమ వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్లు నడుపుతూ గడిపిన పిక్ హల్ చల్ చేస్తుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/