Begin typing your search above and press return to search.

న‌రేష్ - శివాజీ రాజా క‌లిసిపోయి...ప్చ్‌!!

By:  Tupaki Desk   |   23 Jun 2019 2:33 PM GMT
న‌రేష్ - శివాజీ రాజా క‌లిసిపోయి...ప్చ్‌!!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) కొత్త అధ్య‌క్షుడిగా సీనియ‌ర్‌ నరేష్ ఎన్నిక‌య్యాక ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌స్పెన్స్ లో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. మా సొంత భ‌వంతి నిర్మాణం స‌హా.. స‌భ్యుల సంక్షేమ ప‌థ‌కాలపైనా రివ్యూలు జ‌ర‌గ‌లేదు. ఎట్ట‌కేల‌కు నేడు తొలి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌క్సెసైంది. ఎన్నో వివాదాల అనంత‌రం స‌భ్యులంతా స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ఈ మీటింగ్ ని జ‌రుపుకోవ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. వివాదాలున్నా అంద‌రూ స‌హ‌క‌రించార‌ని.. యూనిటీ.. ట్రాన్స్ ఫ‌రెన్సీ.. డెమొక్రసీ పద్ధతుల్లో మా ముందుకెళుతోంద‌ని.. తొలి మీటింగ్ స‌ర‌దాగా.. కోలాహ‌లంగా సాగింద‌ని న‌రేష్ ఆనందం వ్య‌క్తం చేశారు.

`మా` అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ``ఏఎన్నార్ ఆ తర్వాత కృష్ణ.. చిరంజీవి ముఖ్య సల‌హాదారులుగా ఉండేవారు. ఈసారి కృష్ణం రాజుగారిని ఎన్నుకున్నాం. ఈ సందర్భంగా వారిని సత్కరించాం. సంక్షేమం పైనా చ‌ర్చించాం. 33 మందికి ఇచ్చే పెన్షన్ 6 వేల‌కు పెంచాం. మేడే రోజున‌ పెన్షన్‌ డేగా జరుపుకోబోతున్నాం. మా మెంబర్‌ షిప్ కొత్త వారికి రూ.25వేలు ఉంటుంది.రెండేళ్లు 25వేల చొప్పున చెల్లిస్తే పూర్తి స్థాయి మెంబర్‌ షిప్‌ వస్తుంది. 90రోజుల్లో పూర్తి పేమెంట్ చెల్లిస్తే 10వాతం డిస్కౌంట్ ఉంటుంది. ప్ర‌తి ఆర్టిస్టుకి 3ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ని ప్ర‌తిపాదించాం. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ప్లాన్ ఉంది. మూడు ల‌క్ష‌ల‌ నుంచి ఐదు ల‌క్షల‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆర్టిస్టుల‌కి వర్తించేలా చేస్తామని మంత్రి తల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ హామీ ఇచ్చారు. 30 మందికి ప్ర‌భుత్వ పెన్ష‌న్స్ ఇస్తాం. అలాగే కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌థ‌కాలు వ‌ర్తింప చేస్తామ‌ని మంత్రి చెప్పారు`` అని తెలిపారు.

`మా`లో చిన్న చిన్న స్ప‌ర్థ‌లు ఉన్నాయి.. ఎలా జ‌రుగుతుందోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని మా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్ అన్నారు. అయినా ఇంత పెద్ద స‌క్సెస‌వుతుంద‌ని ఊహించ‌లేద‌ని అన్నారు. సమావేశంలో కొంత ఆవేశానికి గురైనా అంతిమంగా ఆరోగ్యకరంగా సాగ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ కలిసి అన్నీ సెట్‌ చేశారని రాజ‌శేఖ‌ర్ అన్నారు. ఇక ఈ తొలి స‌మావేశంలో సీనియర్లు పరుచూరి బ్రదర్స్ - దేవదాస్‌ కనకాల‌- కృష్ణంరాజు దంపతుల‌ను సత్కరించారు.