Begin typing your search above and press return to search.

ఉగాది కానుకగా 'నారప్ప' స్పెషల్ పోస్టర్..!

By:  Tupaki Desk   |   13 April 2021 11:15 AM IST
ఉగాది కానుకగా నారప్ప స్పెషల్ పోస్టర్..!
X
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప''. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క‌లైపులి ఎస్.థాను (వి. క్రియేషన్స్) సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది తమిళ్ లో ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ 'అసురన్' కి రీమేక్. ఇందులో నారప్ప భార్య సుందరమ్మగా హీరోయిన్ ప్రియమణి నటించగా.. తనయుడిగా కార్తీక్ రత్నం కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు ఉగాది పండుగ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ ని వదిలారు.

ఇందులో నారప్ప (వెంకటేష్) తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా కనిపిస్తున్నాడు. పంచె కట్టులో వయసు మీద పడిన వ్యక్తిగా వెంకీ అలరిస్తున్నాడు. ఇకపోతే మే14న ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్‌ లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇంతకముందు ప్రకటించారు. కానీ ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించలేదు. ఇది వెంకటేష్ కు 74వ చిత్రం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్‌ ఎడిటర్ గా.. గాంధీ నడికుడికర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నారు.