Begin typing your search above and press return to search.

ఎర్రటి ఎడారిలో నాన్‌ స్టాప్‌ గా 'నారప్ప'

By:  Tupaki Desk   |   21 Feb 2020 12:30 PM GMT
ఎర్రటి ఎడారిలో నాన్‌ స్టాప్‌ గా నారప్ప
X
తమిళ హిట్‌ మూవీ అసురన్‌ ను తెలుగులో నారప్పగా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఈ రీమేక్‌ ను సురేష్‌ బాబు మరియు కళై పులి ఎస్‌ థానులు నిర్మిస్తున్నారు. గత నెల నుండి ఈ చిత్రం షూటింగ్‌ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు అనంతపురం జిల్లాలో సాగిన ఈ షూటింగ్‌ ఇపుడు తమిళనాడుకు వెళ్లింది. తమిళనాడులో ఎర్రటి ఎడారి అనే ప్రాంతం చాలా ఫేమస్‌ అక్కడ ఈ షూటింగ్‌ జరుగుతోంది.

తమిళనాడులోని తేరి కాడ్‌ అనే ప్రాంతంకు చాలా విషిష్టత ఉంటుంది. అక్కడ చుట్టు ఎక్కడ చూసినా ఎర్రటి భూములు ఉంటాయి. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ భూమి చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పలు సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటూ ఉంటాయి. ఈ ప్రాంతంలో షూటింగ్‌ కాస్త డేంజర్‌ అయినా నారప్పను ఇక్కడ చిత్రీకరించబోతున్నారు.

దాదాపుగా నెల రోజుల పాటు ఈ ఎర్రటి ఎడారిలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ షెడ్యూల్‌ తో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మార్చి చివర్లో సినిమాను పూర్తి చేసి ఇదే సమ్మర్‌ లో సినిమాను విడుదల చేయాలని సురేష్‌ బాబు ప్లాన్‌ గా తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇప్పటికే నారప్ప లుక్‌ రివీల్‌ అవ్వడంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగి పోతున్నాయి.