Begin typing your search above and press return to search.

సింపుల్‌ గా మొదలైన 'నారప్ప'

By:  Tupaki Desk   |   22 Jan 2020 10:18 AM GMT
సింపుల్‌ గా మొదలైన నారప్ప
X
తమిళ హిట్‌ మూవీ అసురన్‌ ను తెలుగులో వెంకటేష్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ నేడు అర్థరాత్రి 12 గంటలకు విడుదలైన విషయం తెల్సిందే. నారప్ప అనే టైటిల్‌ తో ఈ చిత్రంను రూపొందించబోతున్నారు. నేడు ఈ చిత్రం షూటింగ్‌ చాలా సింపుల్‌ గా ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఆయనే క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించాడు. షూటింగ్‌ ప్రారంభం సందర్బంగా నిర్మాతలు కూడా కనిపించక పోవడం ఆశ్చర్యం.

నారప్ప సెట్స్‌ లో వెంకటేష్‌ జాయిన్‌ అయ్యాడు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చాలా స్పీడ్‌ గా పూర్తి చేయాలని శ్రీకాంత్‌ అడ్డాల ప్లాన్‌ చేస్తున్నాడట. అతి త్వరలోనే ఈ చిత్రంలోని హీరోయిన్‌ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సురేష్‌ బాబు మరియు కళై పులి ఎస్‌ థాను ఈ రీమేక్‌ ను నిర్మిస్తున్నారు. నారప్ప గా వెంకటేష్‌ లుక్‌ కు మంచి స్పందన వస్తోంది.

షూటింగ్‌ ప్రారంభం అవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచక పూర్తి చేసి సమ్మర్‌ చివర్లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఎఫ్‌ 2 మరియు వెంకీ మామ చిత్రాలతో చాలా కాలం తర్వాత ఫామ్‌ లోకి వచ్చిన వెంకీ ఈ చిత్రం తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.