Begin typing your search above and press return to search.
చకచక 'నారప్ప' అడుగులు
By: Tupaki Desk | 17 Nov 2020 5:00 AM ISTకరోనా కాలం అవ్వడంతో గతంలో మాదిరిగా సినిమాలను భారీ కాస్ట్ అండ్ క్రూలతో తెరకెక్కించే పరిస్థితి లేదు. ఎంత తక్కువ మంది వీలు అయితే అంత తక్కువ మందితో షూటింగ్ ను పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు తక్కువ సమయంలోనే షూటింగ్ లను చకచక పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే పునః ప్రారంభం అయిన వెంకటేష్ నారప్ప కూడా కీలకమైన షెడ్యూల్ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. సినిమాకు చాలా ముఖ్యమైన ఆ సీన్ కోసం కాస్త ఎక్కువ మందినే నటింపజేసినట్లుగా తెలుస్తోంది.
కీలకమైన ఆ సన్నివేశం పూర్తి అవ్వడంతో ఇరత సన్నివేశాల చిత్రీకరణకు యూనిట్ సభ్యులు వెళ్లబోతున్నారట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ డిసెంబర్ వరకు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎఫ్ 3 కోసం అనీల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ లు జనవరి వరకు ఫ్రీ అవ్వాల్సి ఉంది. అందుకోసమే నారప్ప సినిమాను కాస్త ముందే పునః ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తి చేసే ప్లాన్ ను వెంకీ అమలు చేస్తున్నాడు.
నారప్ప సినిమాలో వెంకీ లుక్ చాలా విభిన్నంగా ఉంటుంది. తమిళ అసురన్ కు రీమేక్ అయిన నారప్ప తెలుగులో కూడా తప్పకుండా కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. కళైపులి ఎస్ థాను మరియు సురేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి మరియు రెబ్బ మోనిక జాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.