Begin typing your search above and press return to search.

3ఏళ్ల తర్వాత నేరుగా ఓటిటి విడుదలకు సిద్ధమైన నరకాసురుడు!

By:  Tupaki Desk   |   3 Jun 2021 12:00 AM IST
3ఏళ్ల తర్వాత నేరుగా ఓటిటి విడుదలకు సిద్ధమైన నరకాసురుడు!
X
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు ముసివేయబడ్డాయి. అందుకే సినీ ఇండస్ట్రీలో థియేట్రికల్ విడుదలకు నోచుకోని సినిమాలన్ని ప్రస్తుతం డిజిటల్ రిలీజ్ బాట పడుతున్నాయి. అందులో తమిళ యువదర్శకుడు కార్తీక్ నరేన్ తెరకెక్కించిన నరకాసురుడు సినిమా కూడా ఒకటి. ఈ నరకాసురుడు సినిమా మూడేళ్లుగా ఆర్థిక సమస్యలతో మూలకు పడిపోయి ఉంది. ఎలాగోలా గతేడాది థియేట్రికల్ రిలీజ్ చేయాలనీ ప్రొడ్యూసర్ గౌతమ్ మేనన్ - డైరెక్టర్ కార్తీక్ భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా మరింత వాయిదా పడింది. కానీ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ అనే ఆలోచన పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ నరకాసురుడు (నరగసూరన్) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సోనీ ఎల్ఐవికి అమ్ముడయ్యాయట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి యంగ్ డైరెక్టర్ కార్తీక్ సెకండ్ మూవీగా తెరకెక్కిన నరకాసురుడు మూవీ 2018లోనే పూర్తయింది. అలాగే అదే ఏడాది సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ప్రొడ్యూసర్ గౌతమ్ మేనన్ ఆర్థికంగా సినిమాను ముందుకు నడిపించలేక పక్కన పెట్టేసారు. ఈ మద్యే తన నిర్మాణంలో ఆగిపోయిన ఒక్కో సినిమాను డిజిటల్ ఏదొక విధంగా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా విడుదల గురించి డైరెక్టర్ కార్తీక్ దాదాపు మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.

అలా ఈ చిత్రం దాదాపు నాలుగేళ్లుగా మూలకు పడి ఉంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విధంగా త్వరలోనే నరగసూరన్ ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవలే డైరెక్టర్ కార్తీక్ నరేన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నరగసూరన్ పోస్టర్‌ను హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసాడు. కార్తీక్ నరకాసురుడు పోస్టర్‌ను షేర్ చేసినప్పటి నుండి సినిమా విడుదల పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కార్తీక్ సెకండ్ మూవీ ఓటిటి రిలీజ్ కాబోతుంది. కానీ ఆల్రెడీ కార్తీక్ నరేన్ తెరకెక్కించిన మూడో సినిమా మాఫియా కూడా రిలీజ్ అయిపోయింది. చూడాలి మరి డైరెక్టర్ ఎలాంటి థ్రిల్ కలిగిస్తాడో.. ఈ సినిమాలో అరవింద్ స్వామి - శ్రీయ - సందీప్ కిషన్ - రెజినా తదితరులు ఉన్నారు.