Begin typing your search above and press return to search.

శర్వానంద్ తో నారా రోహిత్

By:  Tupaki Desk   |   19 Sep 2015 9:21 AM GMT
శర్వానంద్ తో నారా రోహిత్
X
తెలుగులో మంచి టేస్టున్న హీరోల్లో నారా రోహిత్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలే చేస్తూ తన ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ మధ్యే ‘అసుర’ లాంటి మంచి హిట్టు అందుకున్నాడు. ప్రస్తుతం నారా వారబ్బాయి చేతిలో అరడజను దాకా సినిమాలుండటం విశేషం. ఇంతలోనే వారాహి చలనచిత్రం బేనర్ లో ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమాకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ఆరంభమైంది.

జ్యోతి - అచ్యుతరావు - ఆనందరావు అనే ముగ్గురు వ్యక్తుల చుట్టూ సాగే కథ ఇది. ఓ హీరోయిన్ - ఇద్దరు హీరోలన్నమాట. టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేసిన అవసరాల.. ఓ క్యారెక్టరుకు నారా రోహిత్ ను ఎంచుకున్నాడు. మిగతా ఇద్దరి సంగతి ఇంకా తేల్చలేదు. ఐతే రెండో హీరో పాత్రకు శర్వానంద్ ను అనుకుంటున్నట్లు సమాచారం. అతడితో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. శర్వా ఓకే అంటే రోహిత్ తో అతడికి మంచి జోడీ కుదురుతుందనడంలో సందేహం లేదు. ఇద్దరూ విభిన్నమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నవారే. మంచి నటులుగా పేరు తెచ్చుకున్నవాళ్లే. ఈ టాలెంటెడ్ హీరోలిద్దరూ కలిస్తే సినిమాపై ఆసక్తి రెట్టింపవుతుంది. మరి వీరికి హీరోయిన్ ఎవరో చూడాలి. మొత్తానికి టైటిల్, కాంబినేషన్ తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా పై ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి.