Begin typing your search above and press return to search.
తుంటరి కాంటెస్ట్.. భలే రెస్పాన్స్
By: Tupaki Desk | 2 March 2016 7:27 AM GMTసినిమా తీశామా.. దాన్ని మామూలుగా రిలీజ్ చేసేశామా అంటే కుదరదు. ఈ రోజుల్లో జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత ఈజీ కాదు. వైవిధ్యమైన ప్రమోషన్ లతో జనాల్ని ఆకర్షించాలి. ఈ విషయంలో దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచిస్తున్నారు. నారా రోహిత్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘తుంటరి’ విషయంలోనూ ఆ టీమ్ ఓ వైవిధ్యమైన కాంటెస్ట్ తో జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆ కాంటెస్ట్ పేరు.. డైమండ్ గర్ల్.
అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి ఫొటోతో పాటు ఆమె నిక్ నేమ్ జత చేసి ‘తుంటరి’ టీంకు పంపించాలి. ఇలా వచ్చిన ఎంట్రీల నుంచి లక్కీ డ్రా తీసి.. ఒకరికి డైమండ్ ఇస్తారన్నమాట. ఇదీ కాంటెస్ట్. కొన్ని రోజుల కిందటే ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేయగా.. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని.. కొన్ని వేలమంది ఈ కాంటెస్టులో పాల్గొన్నారని చెబుతోంది ‘తుంటరి’ టీమ్. త్వరలోనే లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించబోతున్నారు.
ఇక తమిళ హిట్ మూవీ ‘మాన్ కరాటె’కు రీమేక్ గా తెరకెక్కిన ‘తుంటరి’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కుమార్ నాగేంద్ర దర్శకుడు. లతా హెగ్డే కథానాయికగా పరిచయమవుతోంది. ఇప్పటిదాకా కెరీర్లో ఎక్కువగా సీరియస్ పాత్రలే పోషించిన రోహిత్.. తొలిసారి అల్లరోడి పాత్ర చేస్తున్నాడిందులో. ఆవారాగా తిరిగే కుర్రాడు.. అనుకోకుండా బాక్సర్ గా మారి విలన్ తో పోటీ పడాల్సి వస్తుంది. మరి హీరో ఎలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు.. విజేతగా నిలిచాడు అన్నది ఈ చిత్ర కథ.