Begin typing your search above and press return to search.

ఈసారి తుంటరి రోహిత్ కనపడతాడట

By:  Tupaki Desk   |   21 Oct 2015 2:32 PM IST
ఈసారి తుంటరి రోహిత్ కనపడతాడట
X
సినిమా వాళ్ళు పండగ శుభాకాంక్షలు ఎలా చెబుతారో తెలిసిందే. పండగ సందర్భాన్ని ప్రచార సమయంలా వాడుకుంటారు. ఇదో మార్కెట్ సూత్రం అనుకోండి. అయితే తెలుగు పరిశ్రమలో బుద్దిమంతుడిగా పేరున్న రోహిత్ కూడా ఇలాంటి 'తుంటరి' పనే చేశాడు మరి. విషయానికొస్తే...

రోహిత్ సినిమాల లిస్టులో మాన్ కరాటే రీమేక్ కూడా వుందని తెలుసుగా. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని మొన్నామధ్యన చెప్పిన రోహిత్ ఈ రోజు ఆ పేరుని వెల్లడించాడు. 'తుంటరి' అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారట ఈ చిత్ర బృందం. అయితే ఇప్పటివరకూ నటించిన అన్ని సినిమాలలోనే 'రాముడు మంచి బాలుడు' లాంటి పాత్రల్లో కనిపించిన రోహిత్ ఈ సినిమాకి తుంటరి అన్న టైటిల్ పెట్టుకోడం విశేషం. పూరీ జగన్నాధ్ లాంటి వాళ్ళు తమ సినిమాలకి ఇలాంటి టైటిల్స్ పెట్టడం కొత్తేం కాదు కానీ రోహిత్ సినిమా అంటే ఏదో విషయమున్నట్టే. ఆవారాగా తిరిగే కుర్రాడు ఓ లక్ష్యం కోసం బాక్సర్ గా మారి.. ఎలా పోరాడాడన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రోహిత్ తన అవతారం బాగానే మార్చుకున్నాడు. సన్నబడి, సిక్స్ ప్యాక్ కూడా చేశాడని వార్తలొస్తున్నాయి. నవంబర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్తదనం కోసం పరితపించే రోహిత్ ఈ యాంగిల్ ట్రై చేశాడంటారా..?