Begin typing your search above and press return to search.
నారా రోహిత్ తుంటరి వేషాలకు కత్తెర
By: Tupaki Desk | 15 Dec 2015 3:00 PM ISTకెరీర్లో ఇప్పటిదాకా దాదాపుగా సీరియస్ క్యారెక్టర్లే వేశాడు నారా రోహిత్. ఐతే తొలిసారి అతను తుంటరి వేషం వేయడానికి తయారయ్యాడు. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘తుంటరి’లో కొత్త రోహిత్ ను చూడబోతున్నామన్న సంగతి ఆ సినిమా టైటిల్ - పోస్టర్ బయటికి వచ్చిన రోజే అర్థమైపోయింది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మాన్ కరాటె’కు రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. దీనికి సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందించడం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత సైలెంటుగా ఉన్న తుంటరి టీమ్.. ప్రస్తుతం ఎడిటింగ్ పనిలో బిజీగా ఉంది. ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోందంటూ ఈ రోజే డైరెక్టర్ కుమార్ నాగేంద్ర.. కొన్ని విజువల్స్ ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. ఎడిటింగ్ పని వేగంగా జరుగుతోందని.. త్వరలోనే సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందని కుమార్ చెప్పాడు. జనవరి నెలాఖర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. ‘తుంటరి’లో ప్రథమార్ధమంతా హీరో అల్లరి చిల్లరిగా కనిపిస్తూనే సెకండాఫ్ లో బాక్సర్ గా సీరియస్ అవతారమెత్తుతాడు. ఇందుకోసం నారా రోహిత్ చాలా సన్నబడ్డమే కాదు.. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేసినట్లు సమాచారం. రోహిత్ సరసన లతా హెగ్డే అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటించింది. తమిళంలో శివ కార్తికేయన్, హన్సిక జంటగా నటించారు.