Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: షాకిస్తున్న యంగ్ హీరో మేకోవ‌ర్

By:  Tupaki Desk   |   4 May 2020 9:15 AM IST
ఫోటో స్టోరి: షాకిస్తున్న యంగ్ హీరో మేకోవ‌ర్
X
కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుద‌ల‌తో సాధించ‌లేనిది ఏం ఉంటుంది? జిమ్ లో ఎంత పెద్ద బ‌రువులు అయినా ఇట్టే ఎత్తేయొచ్చు. అంతేనా.. ఒంట్లో బ‌రువు మొత్తం దించేయ‌నూ వ‌చ్చు! అని నిరూపిస్తున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత అత‌డు స‌డెన్ గా అభిమానుల‌కు షాకింగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇప్ప‌టికిప్పుడు నారా రోహిత్ లుక్ చూస్తే.. ఆయ‌నే ఈయ‌నా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతారంతే. ధ్రువ లో రామ్ చ‌ర‌ణ్ లా స్ట‌న్నింగ్ మేకోవ‌ర్ తో క‌నిపిస్తున్నాడు. అత‌డి బాడీ షేప్ మొత్తం మారిపోయింది. ఫేస్ లో బొద్దుత‌నం ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. స్లిమ్ అండ్ ట్రిమ్ గా గెట‌ప్ ని ఛేంజ్ చేసేశాడు. మ‌గువ‌ల గుండెల్లో గుబులు రేపేలా గుబురు మీసం పెంచాడు. తాజాగా రిలీజైన లుక్ చూస్తే ఎవ‌రైనా షాక్ తినాల్సిందే. అంత‌గా మారిపోయాడు నారా వారి వార‌సుడు.

ఇంత‌గా మారిపోవ‌డానికి కార‌ణం.. త్వ‌ర‌లోనే ఓ సినిమాని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ మూవీలో త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ప్ర‌కారం అలా క‌నిపించాలి. అందుకోసం ఏకంగా రెండేళ్ల పాటు శ్ర‌మించి ఇలా లుక్ మొత్తం ఛేంజ్ చేశాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. నారా రోహిత్ ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నించిన వారికి స‌రైన స‌మాధానం ఇచ్చేందుకే సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. స‌రిగ్గా సినిమాని ప్రారంభించాల‌నుకున్న స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారీ రాక‌తో లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ఇది ఎత్తేస్తే ఇక లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించాల‌న్న క‌సితో ఉన్నార‌ట‌. రోహిత్ న‌టించే త‌దుప‌రి సినిమా వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.