Begin typing your search above and press return to search.
రోహిత్ బాగా తగ్గాడమ్మా
By: Tupaki Desk | 17 March 2018 7:39 AM GMTచబ్బీగా ఉండే హీరోల్లో నారా రోహిత్ ముందుంటాడు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు బొద్దుగా ఉండేవాడు. కొన్ని సినిమాల్లో కాస్త తగ్గినట్టు కనిపించినా.... ఎక్కువ మూవీల్లో బరువుగానే కనిపించాడు. శమంతకమణి సినిమాలో అతని లావు మరీ స్పష్టంగా కనిపించింది. సులువుగా బరువు పెరిగే హీరోల్లో రోహిత్ ముందుంటాడు. ఇప్పుడు తేజ సినిమా కోసం పది కిలోలు తగ్గాడు. ఇంకా తగ్గమని చెప్పాడట తేజ.
వెంకటేష్ నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో తేజ ఒక సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా కోసం లావుగా ఉంటే పనికి రాదని చెప్పాడు. అందుకు రోహిత్ కష్టపడి జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ పది కిలోల దాకా తగ్గాడు. నోటికి తాళం వేసుకుని ఏవి పడితే అవి తినకుండా కచ్చితమైన డైట్‌ను పాటించాడు. మొత్తమ్మీద బరువు తగ్గి తేజకు కనిపించాడట. అబ్బే ఇది చాలదు మరో అయిదు కిలోలు తగ్గాల్సిందే అని చెప్పాడట. మరికొన్ని రోజుల్లోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. షూటింగ్ మొదలయ్యే లోపు మరో అయిదు కిలోలు తగ్గి చూపిస్తానని చెప్పాడట రోహిత్.
తేజ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో వెంకీ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడట. వెంకీ - రోహిత్ ఇద్దరూ బావ - బామ్మర్దులుగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ అదితి రావ్ హైదరి కనిపించబోతోందట. మరి వెంకీకి జతగానా లేక రోహిత్ జతగానా అన్నది క్లారిటీ లేదు. భిన్నంగా ఉన్న కథలకే వెంకీ ఓటేస్తున్నాడు. రెగ్యులర్ కథను వదిలేశాడు. కనుక ఈ కథలో ఏదో ఒక కొత్తదనం ఉండే ఉంటుందనుకుంటున్నారు సినీ జనాలు.