Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. మనిషా , రోబోనా?

By:  Tupaki Desk   |   23 Oct 2015 9:00 PM IST
నారా రోహిత్.. మనిషా , రోబోనా?
X
మొన్నటిదాకా జనాలు నారా రోహిత్ ఫలానా ఫలానా సినిమాలు చేస్తున్నారని లెక్కబెట్టుకునేవారు. కానీ అలా లెక్కబెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు నారా కుర్రాడు. అతడి చేతిలో ఉన్న సినిమాల సంఖ్య రెండంకెలకు చేరిపోయినట్లే ఉంది. ‘అసుర’ విడుదలయ్యే సమయానికే అతను దాదాపు అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రోహిత్ స్పీడు చూస్తుంటే అతడు మనిషా లేక రోబోనా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

అసుర విడుదలయ్యాక నెల రోజుల వ్యవధిలో మూడు సినిమాలు మొదలుపెట్టాడు. ఈ మధ్యే సాయి కొర్రపాటి నిర్మాణంలో, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జ్యో అచ్యుతానంద జోజో ముకుందా’ అనే సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా సాయి కొర్రపాటి బేనర్లోనే మరో సినిమా కూడా ఒప్పుకున్నాడు రోహిత్.

ప్రస్తుతం బాలయ్యతో డిక్టేటర్ చేస్తున్న శ్రీవాస్ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన ప్రదీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రోహిత్ కెరీర్ లో ఇది తొలి యాక్షన్ ఎంటర్ టైనర్ అంటున్నారు. త్వరలోనే సినిమా మొదలవుతుంది. శంకర, పండగలా వచ్చాడు, తుంటరి సినిమాల్ని పూర్తి చేసిన రోహిత్.. అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి సినిమాల షూటింగులో బిజీగా ఉన్నాడు. కొత్తగా ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా కలిపితే అతడి సినిమాల లిస్టు పదికి తక్కువగా లేదు.