Begin typing your search above and press return to search.

కథలో రాజకుమారి.. సినిమాలో నారా రోహిత్‌

By:  Tupaki Desk   |   21 Nov 2015 9:30 AM GMT
కథలో రాజకుమారి.. సినిమాలో నారా రోహిత్‌
X
ఇటీవ‌ల కాలంలో జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస ఆఫ‌ర్స్ తో దూసుకెళ్తున్నాడు నారా రోహిత్‌. త‌ను చేసే సినిమాలే కాకుండా టైటిల్స్ కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంటున్నాయి. ఇటీవ‌ల సావిత్రి అనే టైటిల్‌తో ఓ సినిమా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ అలాంటి విభిన్నమైన క్లాసిక్ టైటిల్ ని త‌న తదుప‌రి చిత్రానికి ఖ‌రారు చేశారు. దాని పేరే క‌థ‌లో రాజ‌కుమారి. కార్తికేయ చిత్రాన్ని నిర్మించిన మాగ్నస్ సినీప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించ‌డం విశేషం. జనవరిలో షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.

ఇలా వ‌రుసగా సినిమాలు ప్రారంభిస్తూ సినీ ఇండ‌స్ర్టీ దృష్టిని త‌న వైపుకు మ‌ర‌ల్చుకుంటున్నాడు నారా వార‌బ్బాయి. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్ సినిమాలు నిర్మాత‌ల‌కు - డిస్ట్రిబ్యూట‌ర్స్‌ కు కూడా న‌ష్టాలు లేకుండా లాభాలు తెచ్చిపెడుతుండ‌టంతో త‌న‌తో సినిమా చేయ‌డానికి ముందుకొస్తున్నారు. నారా రోహిత్ ఇంకా కొంచెం క‌ష్ట‌ప‌డితే ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకునే అవకాశాలున్నాయి. ఎప్ప‌టికీ త‌నకంటూ సినిమాలు ఉంటూనే ఉంటాయ‌న్న‌ది సినీ పెద్ద‌ల మాట‌.