Begin typing your search above and press return to search.

యంగ్ హీరో.. 4 నెలలు.. 3 సినిమాలు

By:  Tupaki Desk   |   26 July 2015 3:41 PM IST
యంగ్ హీరో.. 4 నెలలు.. 3 సినిమాలు
X
ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది చాలామంది హీరోలకు. అలాంటిది నాలుగు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు నారా రోహిత్. సినిమాలు ఒప్పుకోవడం, పూర్తి చేయడంలోనే కాదు.. రిలీజ్ చేయడంలోనూ తన స్పీడు ఇంకెవరూ అందుకోలేరని చాటి చెబుతున్నాడు రోహిత్.

నెలన్నర కిందటే రోహిత్ సినిమా ‘అసుర’ రిలీజై మంచి టాక్ తెచ్చకుంది. ఈ సినిమా విడుదలైన రెండు నెలలకే రోహిత్ నటించిన ఇంకో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే.. శంకర. తమిళ సూపర్ హిట్ మూవీ ‘మౌనగురు’కు రీమేక్ ఇది. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమా చాన్నాళ్ల కిందటే పూర్తయింది. తాతినేని సత్య దర్శకుడు. ఆగిపోయిందేమో అనుకున్న ఈ సినిమా గురించి తన పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడాడు రోహిత్. ఆగస్టు నెలాఖర్లో ‘శంకర’ ప్రేక్షకుల ముందుకొస్తుందన్నాడు.

మరోవైపు రోహిత్ కెరీర్లో తొలి కమర్షియల్ సినిమాగా భావిస్తున్న ‘పండగలా వచ్చాడు’ సెప్టెంబర్లో విడుదలవుతుందట. దీంతో పాటు నెల కిందటే షూటింగ్ మొదలైన ‘సావిత్రి’ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని రోహిత్ చెప్పాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని డైరెక్టర్ చేసిన ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. మొత్తానికి వరుసబెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ మిగతా హీరోలందరికీ సవాలు విసురుతున్నాడు రోహిత్.