Begin typing your search above and press return to search.

నారా వారి ప‌ల్లెలో నారా రోహిత్ మిస్సింగ్‌!

By:  Tupaki Desk   |   16 Jan 2023 7:30 AM GMT
నారా వారి ప‌ల్లెలో నారా రోహిత్ మిస్సింగ్‌!
X
ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబ‌రాలు జ‌రుగుతున్నాయి. పాఠ‌శాల‌ల‌కు, ప‌లు ఆఫీస్ ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో రెండు రాష్ట్రాల్లోనూ పండ‌గ వాతావ‌ర‌ణం జోరుగా క‌నిపిస్తోంది. కోళ్ల పందాలు, సంక్రాంతి అల్లుళ్లు, ఆడ‌ప‌డుచుల కుటుంబాల‌తో ప్ర‌తీ తెలుగు లోగిలి వెలిగ‌పోతూ సంబ‌రాల్లో మునిగితేలుతోంది. ఇప్ప‌టికే సంక్రాంతి పండ‌గ‌ని సొంతూళ్ల‌లో జ‌రుపుకోవ‌డం కోసం.. ఆ సంబ‌రాల్లో మున‌గితేల‌డం కోసం సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఊళ్ల‌కు వెళ్లిపోయారు.

అదే త‌ర‌హాలో నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యామిలీతో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఫ్యామిలీ స‌భ్యులు అంతా ప్ర‌త్యేక విమానంలో రేణిగుంట‌కు చేరుకుని అటు నుంచి నారా వారి ప‌ల్లెకు చేరుకున్నారు. చంద్ర‌బాబు నాయుడు నారా లోకేష్ త‌న ఫ్యామిలీ తో క‌లిసి అక్క‌డికి చేరుకున్నాడు. ప్ర‌తీ ఏడాది నారావారి ఫ్యామిలీ అంతా నారా వారి ప‌ల్లెకు వెళ్లిడం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఎప్ప‌టి లాగే ఈ ఏడాది కూడా నారా చంద్ర‌బాబు నాయుడు ఫ్యామిలీతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యామిలీ కూడా నారా వారి ప‌ల్లి వెళ్లింది. బాల‌కృష్ణ‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌, కుమారుడు, కాబోయే హీరో నంద‌మూరి మోక్ష‌జ్ఞ కూడా అక్క‌డి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి టీడీపీ నాయ‌కులు, అక్క‌డి లీడ‌ర్లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంక్రాంతి వేడుక‌ల‌కు నారా చంద్ర‌బాబు నాయుడు ఫ్యామిలీ, బాల‌కృష్ణ ఫ్యామిలీల‌తో క‌లిసి హీరో నారా రోహిత్ ఫ్యామిలీ కూడా అక్క‌డికి వెళ్లి సంక్రాంతిని సెల‌బ్రేట్‌చేసుకోవ‌డం గ‌త కొన్నేళ్లుగా జ‌రుగుతూ వ‌స్తోంది.

ప్ర‌తీ ఏడాది ఈ ఫ్యామిలీస్ అంతా అక్క‌డ పండ‌గ‌ వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఊరి వారితో క‌లిసి సంబ‌రాల్లో పాల్గొంటూ వుంటారు. ర‌క ర‌కాల గేమ్స్ తో పాటు గుర్ర‌పు స్వారీ లాంటివి కూడా చేస్తుంటారు. గ‌త ఏడాది నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ గుర్ర‌పు స్వారీ చేసిన వీడియోలు, ఫొటోలు నెట్టింట సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ పండ‌గ వేళ నారా వారి ప‌ల్లెకు హీరో నారా రోహిత్ రాలేద‌ని తెలుస్తోంది.

గ‌త కొంత కాలంగా నారా వారి ప‌ల్లెకు రావ‌డం సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా నారా లోకేస్ తో పాటు అక్క‌డి వారితో క‌లిసి స‌ర‌దాగా క్రికెట్ ఆడుతూ సంద‌డి చేయ‌డం నారా రోహిత్ కు అల‌వాటు. అయితే ఈ ఏడాది మాత్రం తాను మిస్ అయ్యాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఓ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎప్పుడూ నారా, నంద‌మూరి ఫ్యామిలీతో క‌లిసి సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొనే నారా రోహిత్ ఈ ఏడాది ఎందుకు మిస్స‌యాడ‌ని అంతా ఆరా తీస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.