Begin typing your search above and press return to search.
నారావారబ్బాయి లైన్లో నవరత్నాలు
By: Tupaki Desk | 27 Oct 2015 5:00 PM ISTఓ హీరో ఒకేసారి ఎన్ని సినిమాలు చేస్తాడు? అదేం ప్రశ్న.. పెద్ద హీరో అయితే ఒకటి చేస్తాడు.. చిన్నోళ్లయితే రెండో, మూడో ఉంటాయ్.. ఇంతే కదా, దీనికి మళ్లీ ఓ ప్రశ్న ఎందుకు అనుకుంటున్నారు కదూ. అదే అసలు విషయం.. ఓ హీరో మాత్రం ఒకేసారి 9 సినిమాలు లైన్ లో పెట్టేశాడు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన స్టోరీలతో ఆకట్టుకునే నారా రోహిత్... ఇప్పుడు బాగా స్పీడ్ మీదున్నాడు. ప్రస్తుతం ఇతగాడు నటించిన తుంటరి మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన మాన్ కరాటేకు రీమేక్ ఇది.
దీని తర్వాత నారావారబ్బాయి చేయబోతున్న సినిమాల లిస్ట్ చూస్తే ఔరా అనిపిస్తుంది. శంకర - పండగలా వచ్చాడు, సావిత్రి - అప్పట్లో ఒకడుండేవాడు - వీరుడు - కోటలో రాజకుమారి - జో అచ్యుతానంద - రాజా చెయ్యి వేస్తే అని చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నారా రోహిత్. అన్ని సినిమాలకు మంచి పేరే వచ్చినా.. రీసెంట్ గా అసుర వరకూ కమర్షియల్ సక్సెస్ దక్కలేదు నారా రోహిత్ కి. ఇప్పుడది కూడా తన అకౌంట్ లోకి వచ్చేసరికి - నిర్మాతలు - డైరెక్టర్లు నారా రోహిత్ తో మూవీ చేసేందుకు క్యూ కట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు బ్లాక్ బస్టర్ పై కన్నేశాడని చెప్పుకోవాలి. ఇప్పటికే 9 సినిమాలు అంగీకరించగా.. మరో రెండు ప్రాజెక్టులు డిస్కషన్ దశలో ఉన్నాయి.
ఇవి కూడా విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందుతున్నవే అని టైటిల్స్ తోనే అర్ధమవుతోంది. వీటిలో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ గా నిలిచినా.. నారా రోహిత్ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. స్టార్ స్టేటస్ కి దగ్గరయ్యేందుకు ఇతగాడికి బ్లాక్ బస్టర్ చాలా అవసరం. అందుకోసం రెగ్యులర్ రూట్ ని కాకుండా... భిన్నమైన దారిలో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఒకేసారి 9సినిమాల్లో హీరో కేరక్టర్ ని యాక్సెప్ట్ చేసి... టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అరుదైన రికార్డు సృష్టిస్తున్నాడు.