Begin typing your search above and press return to search.

నారా హీరో ఈసారి భారీ ప్రయోగం.. వర్కౌట్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   10 Aug 2020 11:45 AM IST
నారా హీరో ఈసారి భారీ ప్రయోగం.. వర్కౌట్‌ అయ్యేనా?
X
బాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నారా రోహిత్‌ మొదటి సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కాని నటుడిగా మాత్రం కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. ఆ సినిమా తర్వాత రోహిత్‌ చాలా సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని పర్వాలేదు అనిపించినా ఎక్కువ శాతం నిరాశ పర్చాయి. వరుస ఫ్లాప్స్‌ తో కాస్త గ్యాప్‌ ఇచ్చిన నారా హీరో తన మొదటి సినిమా బాణం చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

దర్శకుడు చైతన్య దంతులూరి బాణంతో కమర్షియల్‌ హిట్‌ దక్కించుకోక పోవడంతో తదుపరి చిత్రంకు గ్యాప్‌ తీసుకుని బసంతి అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా కూడా నిరాశ పర్చింది. దాంతో మళ్లీ గ్యాప్‌ వచ్చింది. ఈసారి నారా రోహిత్‌ తో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఈసారి పీరియాడిక్‌ మూవీ వీరిద్దరి కాంబోలో రాబోతుందట. 1971లో ఒక యుద్దం సమయంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారట. యుద్దంతో పాటు ప్రేమ కథ అంతర్లీనంగా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు.

నారా హీరో ఇప్పటి వరకు చేసిన సినిమాలు కమర్షియల్‌ గా ఆకట్టుకోలేక పోయాయి. ఇలాంటి సమయంలో పీరియాడిక్‌ మూవీ అది కూడా యుద్దం నేపథ్యంలో మూవీ అంటే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెడితే ఈ ఫ్లాప్‌ కాంబో వెనక్కు రాబట్టగలదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని చైతన్య రెడీ చేసిన కథపై అంతా చాలా నమ్మకంగా ఉన్నారట. తప్పకుండా ఈ సినిమా రోహిత్‌ మరియు చైతన్య కెరీర్‌ టర్న్‌ చేయబోతుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రారంభించి అదే ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.