Begin typing your search above and press return to search.

నాన్న‌కు ప్రేమ‌తో షూటింగ్ క‌థ క్లైమాక్స్

By:  Tupaki Desk   |   13 Nov 2015 3:30 PM GMT
నాన్న‌కు ప్రేమ‌తో షూటింగ్ క‌థ క్లైమాక్స్
X
యంగ్‌ టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నాన్న‌కు ప్రేమ‌తో సినిమా షూటింగ్ విష‌యంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. లండ‌న్‌ లో జ‌రిగిన భారీ షెడ్యూల్‌ ను కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వ‌చ్చిన ఈ సినిమా యూనిట్ ఈ నెల‌ 24 నుండి స్పెయిన్‌ లో జ‌రిగే ఫైన‌ల్ షెడ్యూల్‌ లో పాల్గోవాల్సి ఉంది. స్పెయిన్ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌ లో జ‌రిగే క్లైమాక్స్ ఫైట్‌ తో సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టాల‌నుకున్నారు. అయితే స్పెయిన్ షెడ్యూల్ లేట్ అవ్వ‌డంతో హైద‌రాబాద్‌ లో షూట్ చేయాల్సిన స‌న్నివేశాల‌ను ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఎన్టీఆర్ పాటు హీరోయిన్ ర‌కుల్‌ ప్రీత్‌ సింగ్ సినిమాలో మ‌రికొంద‌రు న‌టుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌తో పాటు క్లైమాక్స్‌ లో వ‌చ్చే ఫైట్ సీన్‌ ను షూట్ చేస్తున్నారు. శుక్ర‌వారం ఈ ఫైట్ సీన్‌ ను చిత్రీక‌రించారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై అగ్ర నిర్మాత బీవీఎస్ ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంగా ర‌కుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టులు జ‌గ‌ప‌తిబాబు - రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్ చేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఆఘ‌మేఘాల మీద వ‌ర్క్ చేస్తోంది. రీసెంట్‌ గా దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్‌ లో కూడా సినిమా సంక్రాంతికి వ‌చ్చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో హీరో ఎన్టీఆర్‌ - డైరెక్ట‌ర్ సుకుమార్ ఫాస్ట్‌ గా వ‌ర్క్‌ ను ఫినిష్ చేసేందుకు గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతున్నారు.