Begin typing your search above and press return to search.

అఫీషియల్: నాన్నకు ప్రేమతో 2 మిలియన్స్

By:  Tupaki Desk   |   1 Feb 2016 8:01 AM GMT
అఫీషియల్: నాన్నకు ప్రేమతో 2 మిలియన్స్
X
అనుకున్నంతా అయింది.. మొత్తానికి ఎన్టీఆర్ సాధించేశాడు. సుకుమార్ డైరెక్షన్ లో చేసిన నాన్నకు ప్రేమతో మూవీతో యూఎస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసేశాడు. ఈ మార్క్ అందుకున్న మూడో తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించడంతో పాటు యూఎస్ లో టాలీవుడ్ టాప్ 3 ర్యాంక్ ను కూడా సొంతం చేసేసుకున్నాడు.

జనవరి 29తో ముగిసిన వారానికి నాన్నకు ప్రేమతో మూవీ 2 మిలియన్ల 7వేల 386 డాలర్లను రాబట్టింది. మన కరెన్సీలో అయితే ఇది 13 కోట్ల 60 రూపాయలకు సమానం. అయితే అక్కడి రెంటల్స్ ఎక్కువగా ఉండడంతో, ఇందులో సగం మాత్రమే, దాదాపు ఏడు కోట్లు మాత్రమే షేర్ రూపంలో వస్తుంది. అయినా సరే అమెరికాలో ఏడుకోట్లంటే చిన్న మాట కాదు. మధ్యలో మంచు తుఫాన్ అడ్డం పడి వారం రోజుల పాటు సరిగా షోస్ వేయడం సాధ్యపడలేదు. లేకపోతే ఈ అమౌంట్ ఇంకా ఎక్కువగానే ఉండేది. బాహుబలి, శ్రీమంతుడు మాత్రమే ఇప్పటివరకూ ఈ ఫీట్ సాధించాయి. ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ అవతార్, సుకుమార్ మార్క్ క్లాస్ టేకింగ్ ఈ విజయానికి కారణమయ్యాయి.

ఈ రేర్ ఫీట్ సాధించిన సందర్భంగా డల్లాస్ లో వేసిన స్పెషల్ షోకి నాన్నకు ప్రేమతో విలన్ జగపతి బాబు హాజరయ్యాడు. సినీ గెలాక్సీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పాల్గొని, కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇంత మంచి సినిమాలో ఆఫర్ ఇచ్చినందుకు హీరో - డైరెక్టర్ - నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా.. ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా థాంక్స్ చెప్పాడు జేబీ.