Begin typing your search above and press return to search.
వావ్.. 6వ రోజుకే 40 కోట్ల మార్కు
By: Tupaki Desk | 19 Jan 2016 12:14 PM ISTబాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరు కొనసాగుతోంది. తొలి వారం పూర్తవకుండానే ఈ సినిమా రూ.40 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ మార్కు అందుకోవడం విశేషం. ఫస్ట్ వీకెండ్ - అంటే ఆదివారం వరకు ‘నాన్నకు ప్రేమతో’ రూ.38.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సోమవారం కలెక్షన్లు తగ్గినప్పటికీ మరీ పెద్ద డ్రాప్ ఏమీ కనిపించలేదు. 6వ రోజు - సోమవారం రూ.2 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా తొలి వారం కూడా పూర్తి కాకుండానే ‘నాన్నకు ప్రేమతో’ రూ.40 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. బాహుబలి - శ్రీమంతుడు - అత్తారింటికి దారేది సినిమాల తర్వాత టాలీవుడ్ లో అత్యంత వేగంగా రూ.40 కోట్ల క్లబ్బులో చేరిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’నే.
ఫస్ట్ వీకెండ్ లో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు కలిపి ‘నాన్నకు ప్రేమతో’ రూ.25.23 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. గ్రాస్ రూ.35 కోట్లకు పైనే వచ్చింది. తెలంగాణ వరకే రూ.8 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది యంగ్ టైగర్ మూవీ. కర్ణాటకలోనూ ‘నాన్నకు ప్రేమతో’ దుమ్ము దులుపుతోంది. అక్కడ ఫస్ట్ వీకెండ్ లో రూ.7 కోట్ల గ్రాస్ - రూ.3.65 కోట్ల షేర్ కలెక్టయింది. యుఎస్ లో వసూళ్లు మామూలుగా లేవు. ఇప్పటికే తొలి వారాంతంలోనే ఈ మూవీ అక్కడ ఒకటిన్నర మిలియన్ మార్కును దాటేయడం విశేషం. 1.63 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. 2 మిలియన్ మార్కు దిశగా దూసుకెళ్తోంది. ఎన్టీఆర్ జోరు చూస్తుంటే 50 కోట్ల కల నెరవేరడం ఖాయంగా కనిపిస్తోంది.