Begin typing your search above and press return to search.
వారంలో టాప్ 4కి చేరుకున్న యంగ్ టైగర్
By: Tupaki Desk | 20 Jan 2016 10:27 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తయింది. తొలి వారంలో ఈ మూవీ వసూళ్లు దిమ్మ తిరిగేలా ఉన్నాయన్నది వాస్తవం. బుధవారమే రిలీజ్ కావడం అడ్వాంటేజ్ కాగా.. అదే రేంజ్ ని వీకెండ్ వరకూ చూపించడంతో.. తన రికార్డులను తానే బ్రేక్ చేసేసుకున్నాడు ఎన్టీఆర్.
యంగ్ టైగర్ కెరీర్ లో బెస్ట్ మూవీ అయిన టెంపర్ వసూళ్లను నాన్నకు ప్రేమతో ఒక వారంలోనే రీచ్ అయిపోయింది. తొలి ఏడు రోజుల్లో 42 కోట్లు వసూలు అయినట్లు లెక్కలు రాగా.. ఇంకా పూర్తి ఫిగర్స్ రావాల్సి ఉంది. ఈ కలెక్షన్స్ తో ఇప్పటికే.. మొదటి వారం వసూళ్లలో టాప్ ఫైవ్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అయిపోయాడు. నాన్నకు ప్రేమతో చిత్రానికి టాప్ ఫైవ్ లో నాలుగో స్థానం దక్కడం విశేషం.
ఈ లిస్ట్ లో 151 కోట్లతో బాహుబలి తొలి స్థానంలో ఉంది. ఇది అన్ని భాషల వెర్షన్లకు కలిపి కాగా.. కేవలం తెలుగు వెర్షన్ కి అయినా 107 కోట్ల మొత్తం వచ్చింది. సెకండ్ ప్లేస్ లో ఉన్న మహేష్ శ్రీమంతుడు తొలి ఏడు రోజుల్లో 57.23 కోట్లు రాబట్టాడు. 47.27 కోట్లతో పవన్ అత్తారింటికి దారేది మూడో స్థానంలో నిలవగా.. బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి 36.9 కోట్లు కొల్లగొట్టి ఐదో స్థానంలో నిలిచింది.
ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ని రీచ్ అవడంతో పాటు, తొలి యాభై కోట్ల సినిమాగా రికార్డ్ సృష్టించబోతున్న నాన్నకు ప్రేమతో నాలుగో ప్లేస్ ని సాధించడం విశేషం.