Begin typing your search above and press return to search.

బెంగాళీలో `నాన్న‌కు ప్రేమ‌తో` రీమేక్

By:  Tupaki Desk   |   30 Sep 2021 6:33 AM GMT
బెంగాళీలో `నాన్న‌కు ప్రేమ‌తో` రీమేక్
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ రివెంజ్ డ్రామా... నాన్నకు ప్రేమతో విమర్శకుల ప్రశంసలు అందుకోవ‌డ‌మే గాక 2016 లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించ‌గా జగపతి బాబు ప్రధాన పాత్రను పోషించారు. అత్తారింటికి దారేది నిర్మాత బీవీఎస్ ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు విడుదలైన 5 సంవత్సరాల తరువాత BVSN ప్రసాద్ ప్రొడక్షన్ బెంగాలీ వెర్ష‌న్ ని రెడీ చేసి విడుదల చేస్తోంది.

`నాన్నకు ప్రేమతో` బెంగాలీలో రీమేక్ అయింది. ఇందులో ప్రముఖ బెంగాలీ హీరో జీత్ -ప్రముఖ నటి మిమి చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాజీ అనే టైటిల్ తో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి అన్షుమన్ ప్రత్యూష్ దర్శకత్వం వహించారు. ఇది దుర్గా పూజ స్పెషల్ గా ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 10 న విడుదల కానుంది.

తండ్రి సెంటిమెంట్ తో తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలో ఎన్టీఆర్... జ‌గ‌ప‌తి బాబు న‌డుమ‌ ఎమోష‌న‌ల్ రివెంజ్ డ్రామా ఆక‌ట్టుకుంటుంది. అదే ఎమోష‌న్ ని అంతే ప‌ర్ఫెక్ట్ గా బెంగాలీలోనూ ఎలివేట్ చేస్తున్నార‌ని తెలిసింది.