Begin typing your search above and press return to search.

లైకులు సరే.. వసూళ్ల సంగతేంటి ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   7 Jan 2016 11:30 AM GMT
లైకులు సరే.. వసూళ్ల సంగతేంటి ఫ్యాన్స్
X
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు మహా జోష్ మీద ఉన్నారు. నాన్నకు ప్రేమతో రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం ఒక కారణమైతే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డుని బ్రేక్ చేయలేకపోవడం అభిమానుల ఆనందానికి మరో కారణం. అన్ని నాన్ బాహుబలి రికార్డులు శ్రీమంతుడి పేరుమీదే ఉంటే.. ఎన్టీఆర్ రికార్డును మహేష్ కొట్టలేకపోవడమేంటి అనిపిస్తోంది కదూ! మూవీ సంగతి కాదు.. యూట్యూబ్ లో టీజర్ రికార్డుల లెక్క ఇది.

జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ అయిన మహేష్ బాబు బ్రహ్మోత్సవం ట్రైలర్ కు ఐదున్నర లక్షల వ్యూస్, 11 వేల లైక్స్ వచ్చాయి. అయితే ఈ విషయంలో నాన్నకు ప్రేమతో టీజర్ తో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఎన్టీఆర్. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన మూవీ నాన్నకు ప్రేమతో టీజర్ కు 7.5 లక్షల వ్యూస్ - 24వేల లైక్స్ సాదించింది. దీన్ని అందుకోవడంలో మహేష్ ఫ్యాన్స్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అయితే.. ఇలా లైక్స్ వచ్చినంత మాత్రాన అదే రికార్డ్ అనుకోవడం సరికాదని చెప్పాలి. ఎందుకంటే.. బాహుబలి తర్వాత దాదాపు రికార్డులన్నీ శ్రీమంతుడి పేరుపైనే అంటే మహేష్ అకౌంట్ లోనే ఉన్నాయి. కలెక్షన్ల విషయంలో దీన్ని అందుకునేందుకు మిగతా స్టార్స్ పోటీ పడాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్ అయినా ఇంకెవరైనా సరే.. ప్రస్తుతానికి వారి టార్గెట్ శ్రీమంతుడి కలెక్షన్సే అనడంలో సందేహం లేదు. మరిప్పుడు లైక్స్ తో సరిపెట్టకుండా.. యంగ్ టైగర్ సినిమాని కలెక్షన్స్ విషయంలోనూ రికార్డులు సృష్టించేలా అభిమానులు థియేటర్లకు బారులు తీస్తారో లేదో.. సంక్రాంతి నాటికి తేలుతుంది.