Begin typing your search above and press return to search.

మెగా డాటర్ నాన్న కూచి వచ్చేసింది

By:  Tupaki Desk   |   20 Feb 2018 9:00 AM GMT
మెగా డాటర్ నాన్న కూచి వచ్చేసింది
X
ఇటు తెలుగులో మొదటి సినిమా అటు తమిళ్ లో మొదటి సినిమా రెండు ఝలక్ ఇవ్వడంతో నీహారిక తనకు అచ్చొచ్చిన వెబ్ సిరీస్ వైపే పూర్తిగా ఫోకస్ పెంచేలా ఉంది. నాన్న నాగబాబుతో కలిసి నటించిన నాన్న కూచి వెబ్ సిరీస్ అఫీషియల్ గా జీ ఫైవ్ వెబ్ సైట్ లో మొదటి సీజన్ ఎపిసోడ్స్ అప్ లోడ్ చేసేసారు. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం నాన్న మాజీ లవర్ ని సీన్ లోకి తీసుకొచ్చి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేసే ఒక కూతురి కథగా ఇది రూపొందింది. మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన సిరీస్ బాగానే ఆకట్టుకునేలా ఉంది. ఇందులో నాగబాబు పేరు ఆనంద్ రాజ్ కాగా కూతురిగా నటించిన నీహారిక పేరు తార. సీజన్ 1 పేరుతో ఎనిమిది ఎపిసోడ్లు అందుబాటులో ఉంచిన జీ ఫైవ్ త్వరలోనే సీజన్ 2 కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

జిబిల కొద్ది డేటా తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ లో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. నాగ అశ్విన్, వరుణ్ సందేశ్, నవదీప్ ఈ పాటికే వీటికి టర్న్ తీసుకుని బిజీ అయిపోగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన మాధవన్ బ్రీత్ మల్టీ లాంగ్వేజ్ లో అందుబాటులో ఉండటంతో భారీ రెస్పాన్స్ అందుకుంది. అందుకే వీటికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని జీ ఫైవ్ - అమెజాన్ ప్రైమ్ - యుప్ టివి లాంటి యాప్ బేస్డ్ వీడియో కంటెంట్ వెబ్ సైట్స్ వీటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. నాన్న కూచి జీ టీవీ ఛానల్ లో ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

స్టొరీ లైన్ కాస్త అప్పుడెప్పుడో పాతికేళ్ళ క్రితం వచ్చిన శ్రీకాంత్ మా నాన్నకు పెళ్లి తరహాలో ఉన్నప్పటికీ దీనికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు. కాకపోతే అందులో కొడుకు పాత్రని ఇందులో కూతురిగా మార్పు చేసారు. ఎటువంటి చార్జ్ లేకుండా ఉచితంగా చూసే వెసులుబాటు జీ ఫైవ్ ఇవ్వడం నాన్న కూచి చూడాలి అనుకునే వాళ్ళకు ఊరట కలిగిస్తోంది. అన్నయ్య వరుణ్ తేజ్ వాయిస్ ఓవర్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్