Begin typing your search above and press return to search.

స్టూడెంట్‌ నెం. 1 అవుద్దా? ఏ యాంగిల్లో?

By:  Tupaki Desk   |   16 March 2015 3:30 PM GMT
స్టూడెంట్‌ నెం. 1 అవుద్దా? ఏ యాంగిల్లో?
X
సరే ఒక సినిమాను ప్రమోట్‌ చేయడానికి రకరకాల రేంజుల్లో పబ్లిసిటీ చేస్తాం. ఆరెంజ్‌ ఓ రేంజ్‌ ఉన్న సినిమా అంటూ ఆరెంజ్‌ ఆడియో లాంచ్‌లో బ్రహ్మానందం సెలవిచ్చారు. కాని సినిమా విడుదలయ్యా ప్రేక్షకులు ఆ రేంజ్‌ను చూసి షాకయ్యిని సంగతి తెలిసిందే. ఇకపోతే ఇలాంటివి ఆడియో లాంచ్‌ల్లో షెరా మామూలే అయినా కూడా.. మరో సినిమాతో పోల్చుకుంటూ ప్రమోట్‌ చేసుకోవడం అనేది మాత్రం కాస్త కామెడీగా కనిపిస్తోంది ఇప్పుడు.

అప్పట్లో కింగ్‌ నాగార్జున ఢమరుకం సినిమా ఆడియో లాంచ్‌లో మాట్లాడుతూ.. తన సినిమా పాటలను దేవిశ్రీ ప్రసాద్‌ బాగా కొట్టాడని.. పవన్‌ కళ్యాణ్‌కు ఇచ్చిన గబ్బర్‌సింగ్‌ ఆడియో కంటే ఇవే సూపర్‌ అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈనాటికీ మనకు ఢమరుకం సినిమాలోని ఒక్క పాట కూడా గుర్తుండే సీన్‌ లేదు. అలాగే ఇప్పుడు హీరో నాని ప్రొడ్యూసర్లు.. అశ్వినీదత్‌ కూతుళ్లు.. అప్పట్లో తమ బ్యానర్‌లో వచ్చిన స్టూడెంట్‌ నెం.1 సినిమాతో ఎన్టీఆర్‌ ఎలా నెం.1 హీరో అయ్యాడో ఇప్పుడు తన ''ఎవడే సుబ్రమణ్యం'' సినిమాతో నాని కూడా ఇలాగే సూపర్‌హిట్‌ అయిపోతాడని ప్రమోట్‌ చేస్తున్నారు. అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్‌ది మాస్‌ సినిమా. ఇక నాని చేసిందేమో డిఫరెంట్‌ జానర్‌. ఈ సినిమాతో ఆ రేంజ్‌ సక్సెస్‌ సాధ్యమేనా? ఏ యాంగిల్లో అయినా కుదురుతుందా? ఏమో మరి.