Begin typing your search above and press return to search.

సుందరం, లీలా సందడి షురూ.. నజ్రియాపై నాని విన్‌

By:  Tupaki Desk   |   26 May 2022 12:30 PM GMT
సుందరం, లీలా సందడి షురూ.. నజ్రియాపై నాని విన్‌
X
నాని హీరోగా నజ్రియా హీరోయిన్‌ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వారం ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది.

సినిమా ప్రమోషన్ ను చాలా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఆడుతూ పాడుతు అన్నట్లుగా హీరో నాని మరియు హీరోయిన్‌ నజ్రియాలు సినిమా యొక్క ప్రమోషన్‌ లో పాల్గొంటున్నారు. ఆ మద్య ఇద్దరి యొక్క అభిరుచులు ఏంటీ అంటూ ఒక ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. మెజారిటీ అభిరుచులు కలవడం అందరిని ఆశ్చర్య పరిచింది.

ఇక తాజా ప్రమోషనల్‌ వీడియోలో వీరిద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవడం.. ఆ సందర్భంగా ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసు.. ఏం తెలుసు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నాని గురించి మెహ్రీన్‌ కు పెద్ద గా తెలియదని అందులో తేలిపోయింది.

కాని మెహ్రీన్‌ గురించి చాలా విషయాలు నానికి తెలుసని.. ఆమెతో నటించడం మాత్రమే కాదు... ఆమె పర్సనల్‌ పై కూడా నాని ఫోకస్ పెట్టాడు అనుకునే విధంగా సమాధానాలు చెప్పాడు.

నజ్రియా కు నాని గురించిన విషయాలు పెద్దగా తెలియలేదు. కాని నజ్రియా గురించి మాత్రం నాని చాలా సులువుగా చెప్పేశాడు. నజ్రియా ఎక్కువగా వాడే మొబైల్ యాప్‌ ఏంటీ అంటే ఇన్ స్టాగ్రామ్‌ అని.. నజ్రియాకు యూరోప్ అంటే ఇష్టం అని... ఆమె రాశి ధనుస్సు అని చెప్పుకొచ్చాడు. ఇక నాని గురించి అడిగిన ప్రశ్నల్లో నజ్రియా కేవలం ఒకే ఒక్క సమాధానం చెప్పింది.

నానికి దళపతి సినిమా ఇష్టం అనే విషయాన్ని మాత్రమే నజ్రియా చెప్పుకొచ్చింది. మిగిలిన ఏ విషయాలు కూడా ఆమె చెప్పలేక పోయింది. చాలా ఫన్నీగా సరదాగా సాగిన ఈ ప్రమోషనల్‌ గేమ్‌ లో నజ్రియా పై నాని విన్‌ అయ్యాడు. సినిమా విడుదల సమయం కు వీరిద్దరి జోరు.. సందడి ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్ టైన్మెంట్‌ ను అందించే అవకాశాలు ఉన్నాయి.