Begin typing your search above and press return to search.

జెర్సీలో కూడా నాని డాక్టరే!

By:  Tupaki Desk   |   16 Aug 2018 4:09 AM GMT
జెర్సీలో కూడా నాని డాక్టరే!
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అక్కినేని నాగార్జున తో కలిసి 'దేవదాస్' అనే మల్టిస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాకుండా 'జెర్సీ' అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. సుమంత్ సినిమా 'మళ్ళీ రావా' తో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నాని ఓ డాక్టర్ పాత్ర లో కనిపిస్తాడట. అదేంటి.. 'దేవదాస్' సినిమాలో కదా నాని డాక్టర్ క్యారెక్టర్ చేసేది అని మీరనుకోవచ్చు. కానీ ఇందులో కూడా ఒక డాక్టర్ రోల్ చేస్తున్నాడట. మరి ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ అని అన్నారు.. దానికి తోడు టైటిల్ కూడా క్రికెటర్ ధరించే షర్టు 'జెర్సీ' అని పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హెల్మెట్.. బ్యాట్.. లెగ్ ప్యాడ్స్ అన్నీ చూపించారు అని మీరు తికమకపడనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో నానిది డబల్ రోల్. నాన్ననాని క్రికెటర్ అయితే కొడుకు నాని డాక్టర్.

'ఇట్స్ నెవర్ లేట్ టు డ్రీమ్ అనేది 'జెర్సీ' ఈ సినిమా క్యాప్షన్. సెప్టెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నాడు.