Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ దిష్టి తీసిన మిసెస్ నాని

By:  Tupaki Desk   |   1 Oct 2018 11:10 AM GMT
ఆన్ లైన్ దిష్టి తీసిన మిసెస్ నాని
X
ఏదైనా కార్యం పూర్తయినప్పుడు గుమ్మడికాయ కొట్టడం ఆనవాయితి. సినిమా షూటింగ్స్ లో సైతం ఇది విధిగా పాటిస్తూ ఉంటారు. నిన్న నాని బిగ్ బాస్ 2 షో పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని భార్య అంజు యలవర్తి తన ట్విట్టర్ అకౌంట్ లో గుమ్మడికాయ ఫోటోను పోస్ట్ చేసి హమ్మయ్య ఓ పనైపోయింది అనేలా రియాక్షన్ ఇవ్వడంతో షోని ఎంత బరువుగా ఫీలవుతున్నారో అర్థమవుతోంది అని అభిమానులు కామెంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి నాని ఈ షోకు యాంకర్ గా చేయటం మిశ్రమ స్పందన దక్కించుకుంది.

తన లోపం లేకుండా శాయశక్తులా షోని నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని సార్లు ఆకారణంగా తనను ట్రాల్ చేయడం పట్ల నాని కొంత ఫీల్ అయ్యాడు. సోషల్ మీడియా ట్రెండ్స్ ని గమనించే అంజుకి ఇది తెలియనిది కాదు. అందుకే శుభసూచకంగా ఇలాపెట్టేసి గుడ్ బై చెప్పేసిందన్న మాట.వీక్ ఎండ్ లో షూటింగ్ ప్రహసనం అంటూ ఇబ్బంది లేకుండా నాని నేరుగా ఇంటికే వస్తాడుగా.

మూడో సీజన్ కోసం కూడా నానిని సంప్రదిస్తే నో చెప్పాడని ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. నాని నిజంగానే ఆ ఉద్దేశంలో ఉన్నట్టు లేడు. గత ఏడాది లాగా ఈ సంవత్సరం సినిమాల పరంగా జోష్ తగ్గింది. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ కాగా దేవదాస్ ఫలితం యావరేజ్ కు పైనో కిందో నిలిచేలా ఉంది తప్ప సూపర్ హిట్ అనిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దానికి తోడు బిగ్ బాస్ కు అదిరింది అనే రెస్పాన్స్ అయితే రాలేదు. సో జెర్సీతో పాటు తర్వాత చేయబోయే సినిమాల మీద నాని ప్రత్యేక శ్రద్ధ వహించబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ మూడు నెలల్లో నాని కొత్త సినిమా వచ్చే అవకాశం లేదు. అప్పటిదాకా దేవదాస్ తో సర్దుకోవాల్సిందే.