Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సన్నాఫ్ న్యాచురల్ స్టార్!

By:  Tupaki Desk   |   26 Dec 2018 8:35 AM GMT
ఫోటో స్టొరీ: సన్నాఫ్ న్యాచురల్ స్టార్!
X
జున్ను బాబు తెలుసుకదా..? మన న్యాచురల్ స్టార్ నాని ముద్దుల కుమారుడు. పైన ఫోటోలో ఉండేది జున్ను బాబే. క్రిస్మస్ సందర్భంగా నాని వైఫ్ అంజన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ ఫోటో పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ నాటిదట ఈ ఫోటో. ఏడాది గడిచింది గానీ ఫోటోలో ఉన్న బ్యూటిఫుల్ స్మైల్స్ మాత్రం ఇంకా అలానే ఉన్నాయి.

ఈ ఫోటో లో జున్ను బాబు అమ్మ ఒళ్ళో కూర్చుని ప్లెజెంట్ గా నవ్వుతున్నాడు. ఈ ఫోటోతో పాటు అంజన ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిపింది. తన జోకులకు నవ్వేవాళ్ళు కనీసం ఒకరున్నానని అందకు తనకు చాలా సంతోషం గా ఉందని తెలిపింది. ఈ లెక్కన అంజన జోకులకు జున్నుబాబు నవ్వుతాడు గానీ నాని నవ్వడన్న మాట. ఇప్పుడంటే చిన్నబాబు కానీ కాస్త ఊహ తెలిస్తే మాత్రం ఆ జోకులకు నవ్వేవరకూ నాన్నను వదిలిపెట్టడు.

నాని ఫ్యామిలీ ఇలా ఉంటే నాని తన నెక్స్ట్ సినిమా 'జెర్సీ' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.