Begin typing your search above and press return to search.

నానికి బ్రేకులేసిన ఇంద్రగంటి!

By:  Tupaki Desk   |   6 March 2020 6:43 AM GMT
నానికి బ్రేకులేసిన ఇంద్రగంటి!
X
నాని 'జెర్సీ' సినిమా హిట్టా కాదా? ట్రేడ్ లెక్కల ప్రకారం అయితే ఫ్లాప్. బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 30% నష్టాలు వచ్చాయని సమాచారం. ఇప్పుడు ఆ నష్టాలను నాని నెక్స్ట్ సినిమా 'V' లో కవర్ చేసుకుందామని బయ్యర్లు కాచుకుని కూర్చున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నాని సినిమా మాత్రమే కాదు.. సుధీర్ బాబు కూడా ఇందులో హీరో. దీంతో పాత సినిమాల లాస్ సెటిల్మెంట్ వ్యవహారాలు అంత సులువు కాదు.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రమోషన్స్ లో సుధీర్ బాబుకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో లుకలుకలు బయటపడ్డాయని అంటున్నారు. 'V' సినిమాను సుధీర్ బాబు సినిమాలా కాకుండా నాని సినిమాలా ప్రొజెక్ట్ చెయ్యాలని నాని ఇంటర్నల్ గా పీఆర్ టీమ్ కు చెప్పారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈమధ్య టీజర్ రిలీజ్ అయిన సమయం లో సోషల్ మీడియా హ్యాష్ టాగ్స్ లో 'నాని V టీజర్' అని పోస్టులు చేయించారట. ఈ విషయం తెలిసి సుధీర్ బాబు అప్సెట్ అయ్యారట. ఈ విషయం దర్శకుడు ఇంద్రగంటి వద్దకు తీసుకుపోవడంతో ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. పీఆర్ టీమ్ ను పిలిపించి పబ్లిసిటీలో నానికి ఎంత వెయిటేజ్ ఇస్తారో సుధీర్ బాబుకు అంతే వెయిటేజ్ ఇవ్వాలని గట్టిగా చెప్పి పంపారట. ఇంద్రగంటి ని నాని గురువు లాగా భావిస్తారని అందుకే ఈ విషయంలో సైలెంట్ అయి పోయారని టాక్.

నాని స్టార్ హీరో అనే మాట నిజమే కానీ సుధీర్ బాబు కు మహేష్ బాబు అభిమానుల సపోర్ట్ ఉంటుంది. అందుకే సుధీర్ బాబు సినిమాలు ఎలా ఉన్నా ఫస్ట్ డే మార్నింగ్ షోలకు హౌస్ ఫుల్స్ పడుతుంటాయి. హిట్ టాక్ వస్తే అది కంటిన్యూ అవుతుంది. అందుకే సుధీర్ బాబు ను తక్కువ అంచనా వెయ్యలేం. ఇవన్నీ పక్కన పెడితే ఈ నాని-సుధీర్ బాబు 'V' తో ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.