Begin typing your search above and press return to search.

తనలోని నలభీమున్ని నిద్రలేపిన నాని

By:  Tupaki Desk   |   25 March 2020 7:27 PM IST
తనలోని నలభీమున్ని నిద్రలేపిన నాని
X
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇళ్లు దాటి ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. వైరస్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వ హెచ్చరికలు ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకి పంపిస్తున్నారు. సెలెబ్రెటీలు గడప దాటకుండా ఇళ్లలో కూర్చొని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సూచనలను ఇస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నాని కరోనా సెలవలు కావడంతో ఇంట్లో వంట ప్రయోగాలు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వారికి ఇంటి, వంట పనులలో సాయపడుతున్నాడు. ఫస్ట్ నుండి గరిటె తిప్పడంలో అలవాటు ఉన్న నాని.. చాలా ఏళ్ల తరువాత ఖాళీ దొరకడంతో తనలోని నలభీముడుకి పనిచెప్పారు. వంట గదిలో గరిటె తిప్పుతూ, రుచికరమైన మసాలా శనగ కర్రీ చేస్తూ వీడియోను వదిలాడు. శ్రేయాస్ మీడియా గ్రూప్ వాళ్ళు షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి