Begin typing your search above and press return to search.

మండల రెవెన్యూ అధికారి క‌థ‌తో ట‌క్ జ‌గ‌దీష్‌..?

By:  Tupaki Desk   |   24 Aug 2021 9:30 AM GMT
మండల రెవెన్యూ అధికారి క‌థ‌తో ట‌క్ జ‌గ‌దీష్‌..?
X
ప‌క్కింట‌బ్బాయి పాత్ర‌ల‌తోనే కాదు డేంజ‌ర‌స్ కిల్ల‌ర్ పాత్ర‌లోనూ అద్భుతంగా న‌టించాడు నేచుర‌ల్ స్టార్ నాని. నేను లోకల్ లో సెంటిమెంట్లు ఉన్న లోక‌ల్ యువ‌కుడిగా క‌నిపించిన నాని `వీ` చిత్రంలో ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్ గా న‌టించి మెప్పించాడు. ఇప్ప‌డు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే MRO గా అత‌డు న‌టించాడు.

ట‌క్ జ‌గ‌దీష్ అనే అధికారిగా నాని విన్యాసాలు తెర‌పై వీక్షించే స‌మ‌య‌మాస‌న్న‌మైంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల `టక్ జగదీష్` రిలీజ్ ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది. వాస్త‌వానికి సెకండ్ వేవ్ ముందే రిలీజ్ కావాల్సిన‌ది ఆల‌స్య‌మైంది. దీంతో విడుదల నిర్ణయాన్ని నిర్మాతలకు వదిలేశారు. ఇటీవ‌ల థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో వ‌స్తుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

టక్ జగదీష్ గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. టీజ‌ర్ లో నాని స్టైలిష్ గా ట‌క్ చేసుకుని అటుపై పొలంలో దిగి గొడ‌వ‌కి రెడీ అవుతున్న వైనం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఈ పాత్ర ట‌క్ వెన‌క కార‌ణం కూడా అంతే బ‌లంగా ఉంది. అత‌డు మండల రెవెన్యూ అధికారి (MRO) గా క‌నిపిస్తున్నాడ‌ట‌. అంటే భూస‌రిహ‌ద్దుల త‌గాదాల్లోనూ త‌ల‌దూర్చాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అందుకే అక్క‌డ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం క‌నిపించింది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టే ట‌క్ వేసుకుని రోజుల త‌ర‌బ‌డి షూటింగుల్లో పాల్గొన్నాడు నాని. త‌న స్టైల్ ని పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మార్చుకున్నాడు. నాని గ‌ట్స్ ఉన్న ఎంఆర్వో గా భ‌యంలేని వాడిగా క‌నిపిస్తాడ‌ని తెలిసింది.

దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ పాత్రను బలమైన భావోద్వేగాలు కుటుంబ బంధాలతో రూపొందించారు. కుటుంబ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే నాని థియేట్రికల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఉన్నా చివ‌రికి నిర్మాత‌ల ఒత్తిళ్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ రిలీజ్ కి అంగీక‌రించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. వినాయ‌క‌ చవితి సందర్భంగా సెప్టెంబ‌ర్ 10న‌ విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ నిర్మాత‌లు అధికారికంగా మ‌రోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అదేరోజు నాగ‌చైత‌న్య - క‌మ్ముల కాంబినేష‌న్ మూవీ ల‌వ్ స్టోరి థియేట‌ర్ల‌లోకి రిలీజ్ కానుంది.