Begin typing your search above and press return to search.
నాని రేంజ్ పెరగాలంటే అది తప్పనిసరి
By: Tupaki Desk | 30 Sept 2016 11:30 AM ISTఒక హీరో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఏకంగా నాలుగు సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేసి అందులో మూడు సినిమాలు విడుదల చేసి మూడింటిని విజయతీరాలకు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించిన నాని నిజంగానే సూపర్ ఫామ్ లో వున్నాడని చెప్పాలి.
అటు క్లాస్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని ఏకకాలంలో ఆకట్టుకుంటూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న నాని ఇప్పుడు 20కోట్ల హీరోగా మార్కు సంపాదించుకున్నాడు. ఓవర్ సీస్ లో సైతం నాని సినిమాలకు మంచి ఆదరణ వుండడం మరింత కలిసొచ్చే అంశం. అయితే నాని రేంజ్ మరింత పెరగాలంటే ఒక స్టార్ డైరెక్టర్ తో ప్రాజెక్టు పడడం తప్పనిసరి.
రాజమౌళి ఈగలో నాని నటించినా అది 40కోట్ల షేర్ తెచ్చినా క్రెడిట్ మొత్తం జక్కన్నదే. అలా కాకుండా ఫుల్ టైం హీరోగా పెద్ద దర్శకుడితో నటిస్తే నాని మార్కెట్ మరింత పెరుగుతుంది. నితిన్ తో అ.. ఆ... లు దిద్దించిన త్రివిక్రమ్ తోగాని, రాజ్ తరుణ్ కి హిట్ అందించిన సుకుమార్ లాంటి డైరెక్టర్ నానితో ప్రాజెక్టు చేస్తే మంచి హెల్ప్ అవుతుంది. మరి నాని మనసులో ఏముందో..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/