Begin typing your search above and press return to search.

కరెక్టు సినిమాతో వస్తున్నా .. క్రిస్మస్ మనదే

By:  Tupaki Desk   |   18 Nov 2021 8:49 AM GMT
కరెక్టు సినిమాతో వస్తున్నా .. క్రిస్మస్ మనదే
X
ఇప్పుడు ఎక్కడ చూసినా 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి రాహుల్ సాంక్రుత్యన్ దర్శకత్వం వహించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు.

ఈ కథ కలకత్తా నేపథ్యంలో నడుస్తుంది. డిఫరెంట్ లుక్ తో నాని కనిపిస్తున్న ఈ సినిమాను , డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "రెండేళ్ల తరువాత థియేటర్ కి వస్తున్నామంటే ఈ మాత్రం సందడి ఉండాలిగదా. ఈ రోజున మీ అందరినీ ఇలా చూడటం .. మీ అరుపులు వినడం .. కడుపు నిండిపోయింది. దీని కోసమే కదా మనం కష్టపడేది .. దీని కోసమే కదా మనం పనిచేసింది అనిపించింది.

కరెక్టు సినిమాతో వస్తున్నా .. క్రిస్మస్ మాత్రం మనదే .. ఫిక్స్ అయిపోవడమే. ఈ సినిమా చేసే అవకాశం నాకు లభించినందుకు నేను గర్వపడుతున్నాను. అన్ని డిపార్టుమెంట్స్ కలుపుకుని ఒక మంచి టీమ్ దొరికినప్పుడు ఎలాంటి సినిమా బయటికి వస్తుందనడానికి నిదర్శనమే 'శ్యామ్ సింగ రాయ్'.

డిసెంబర్ 24వ తేదీన మీరు ఈ సినిమా చూడబోతున్నారు. మీ అందరితో కలిసి ఎప్పుడు ఈ సినిమా చూస్తానా అని నాకూ ఉంది. ఈ అరుపులు .. ఈ సౌండ్లు .. ఈ ఎనర్జీని కాస్త దాచుకోండి. ఇంతకు వందరెట్లు ఇంపాక్ట్ థియేటర్లో ఉంటుంది. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.

మా నిర్మాత వెంకట్ గారు చాలా చాలా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. అప్పుడు అందరి గురించి వివరంగా మాట్లాడతాను" అన్నాడు. ఆ తరువాత ఆయన మీడియావారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

"ప్రతి సినిమా కొత్తగా ఉండాలనీ .. కొత్తగా కనిపించాలనే అనుకుంటాము. కాకపోతే కొన్ని బాగా కుదురుతాయి .. మరికొన్ని కుదరవు. ప్రయత్నంలోగానీ .. కష్టపడటంలోగాని ఎలాంటి లోపం ఉండదు. అలా కష్టపడి చేసిన సినిమానే 'శ్యామ్ సింగ రాయ్' .. ఈ సినిమాకి అన్నీ కుదిరేశాయని అనిపిస్తోంది.

ఇంతకుముందు 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో ఒకసారి క్రిస్మస్ కి వచ్చాము. ఆ సినిమాలానే ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బలంగానే ఉంది. టీజర్లో అనేక సందర్భాలు కనిపిస్తున్నా, ఇది లవ్ స్టోరీనే. సత్యదేవ్ గారు అద్భుతమైన కథను ఇచ్చారు. దానిని మరింత అద్భుతంగా రాహుల్ మీ ముందుకు తీసుకుని వస్తున్నాడు" అని చెప్పుకొచ్చాడు.