Begin typing your search above and press return to search.
కొత్త టర్నింగ్ తీసుకుంటున్న నాని
By: Tupaki Desk | 25 May 2019 1:33 PM ISTగత ఏడాది చేదు ఫలితాలను ఇచ్చినా ఈ సంవత్సరం జెర్సీతో వసూళ్ళ కన్నా ఎక్కువగా ప్రశంసలు దక్కించుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నెలాఖరున రానున్న ఈ మూవీపై నాని అభిమానులతో పాటు టైటిల్ కారణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుదీర్ బాబు-ఆదితి రావు హైదరి జంటగా రూపొందుతున్న మూవీలో నాని ఓ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం విదితమే.
వి టైటిల్ తో ఇప్పటికే ఇది ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. నాని పాత్ర ఎంత లెంత్ ఉంటుంది మెయిన్ లీడ్ పెయిర్ కి అతనికి కనెక్షన్ ఏమై ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం నాని కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడని తెలిసింది. అలా అని చెడ్డవాడు కాదు. మంచి విలన్ లాగా అన్న మాట. ఇంకా చెప్పాలంటే జెంటిల్ మెన్ లో అర్జున్ టాగోర్ లో చిరంజీవి టెంపర్ లో జూనియర్ ఎన్టీఆర్ వీటిలో హీరో పాత్రలు గుర్తున్నాయిగా.
చేసే పనులు తప్పుగా అనిపించినా లక్ష్యం మంచిది కాబట్టి అవి తప్పు కానే కాదు అనే రీతిలో విలో నాని పాత్రను ఇంద్రగంటి తీర్చిదిద్దారట. వి టైటిల్ కూడా నానిని ఉద్దేశించి పెట్టినదే అని మరో న్యూస్ ప్రచారంలో ఉంది. ఏదైతేనేం నాని రొటీన్ రూట్ లో పడకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. జెర్సి లో ఏడిపించి గ్యాంగ్ లీడర్ లో నవ్వించబోతున్న నాని విలో ఆలోచింపజేయబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. అదే కనక జరిగితే ఈ ఇయర్ లో మొత్తం మూడు నాని సినిమాలు వచ్చినట్టు అవుతుంది.